Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి

నేటి సత్యం/ శేరిలింగంపల్లి /సెప్టెంబర్ 7

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి

ఏఐటీయూసీ బలపరిచిన ఆర్టీసీ కూటమి సభ్యులను గెలిపించండి

టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు. కే చందు యాదవ్ సిపిఐ శేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి

ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో ఏఐటీయూసీ బలపరిచిన ఆర్టీసీ కూటమి సభ్యులకు కార్మికులు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుతూ ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కార్మికులకు న్యాయమైన వేతనాలు, పెండింగ్ బకాయిల చెల్లింపు, పీఆర్సీ అమలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత, సిబ్బంది కొరతను నివారించడం, పని భారాన్ని తగ్గించడం వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి

ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు మెరుగైన వైద్య భద్రత కల్పించేందుకు ప్రతి కార్మికుడికి రూ.50 లక్షల హాస్పిటల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలని టి. రామకృష్ణ కోరారు.

అలాగే ఆర్టీసీ కార్మికుల పిల్లల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించే విధంగా ప్రత్యేక విద్యా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రతి ఆర్టీసీ కార్మికుడికి సొంత ఇంటి సౌకర్యం కల్పించే విధంగా గృహ పథకాన్ని అమలు చేయాలని కోరారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు కార్మికుల ఉద్యోగ భద్రత, వేతనాలు, సంక్షేమం, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించే అవకాశం ఉంటుందని అన్నారు.

కార్మికుల సమస్యలను యాజమాన్యం, ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించడంతో పాటు అవసరమైనప్పుడు సంఘటిత పోరాటాలను నిర్వహించే విధంగా కార్మిక సంఘాలు బలంగా ఉండాలని ఆయన అన్నారు.

ఆర్టీసీ కార్మికుల హక్కులు – ఉద్యోగ భద్రత – కుటుంబ సంక్షేమం – పిల్లల భవిష్యత్తు – సొంత ఇల్లు – మెరుగైన వైద్యం కోసం కార్మికులందరూ ఐక్యంగా నిలవాలని, ఏఐటీయూసీ బలపరిచిన ఆర్టీసీ కూటమి సభ్యులకు మద్దతు ఇవ్వాలని టి. రామకృష్ణ విజ్ఞప్తి చేశాను ఈ కార్యక్రమంలో సిపిఐ శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి కే చందు యాదవ్ ఏఐటియుసి మండల కార్యదర్శి తుపాకుల రాములు డి హెచ్ పి ఎస్ మండల కార్యదర్శి ఎస్ కొండలయ్య పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments