Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

పునర్విభజనపై ఆశా బహులు ..!

నేటి సత్యం/ కామారెడ్డి

నియోజకవర్గాల పునర్విభజన పై ఆశలు.. బాన్సువాడలో రాజకీయ వేడి!
కొత్త నియోజకవర్గాలపై నేతల వ్యూహాలు.. బరిలోకి దిగేందుకు పలువురు ఆశావహుల సన్నాహాలు
పోచారం నుంచి బాజిరెడ్డి వరకు.. అవకాశం కోసం ఎదురుచూపులు!
కామారెడ్డి అక్టోబర్ 23 నేటి సత్యం ప్రతినిధి దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందా? లేదా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పునర్విభజన జరిగే అవకాశం ఉందని భావిస్తుండగా, మరికొందరు ఇప్పట్లో అలాంటి పరిణామాలు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని పలువురు రాజకీయ నాయకులు ఇప్పటి నుంచే తమ రాజకీయ భవిష్యత్తుపై వ్యూహాలు రచిస్తున్నట్లు చర్చ సాగుతోంది.
కొత్త నియోజకవర్గాలపై నేతల గురి!
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందన్న అంచనాలతో పలువురు సీనియర్ నాయకులు తమ వారసులు, అనుచరులకు రాజకీయంగా అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా యువత, కొత్తతరం నాయకులకు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉందని పలువురు ఆశావహులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బాన్సువాడలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు!
బాన్సువాడ నియోజకవర్గంలోనూ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ చర్చలు ఊపందుకుంటున్నాయి. వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి రావచ్చని, తద్వారా తమకు కూడా అవకాశం లభించవచ్చని కొందరు ఆశావహులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి లు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌లు కూడా రాజకీయంగా తమకు అనుకూలమైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
బీజేపీలోనూ ఆశావహుల జాబితా!
బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణతో పాటు కోనేరు శశాంక్, తాడ్కోల్ శ్రీనివాస్‌రెడ్డి, పైడి మల్ లక్ష్మీనారాయణ తదితరుల పేర్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వీరి తో పాటు బీర్కుర్ కు చెందిన మరో సీనియర్ నాయకుడు పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగి రాజకీయ సమీకరణాలు మారితే తమకు అవకాశం దక్కుతుందన్న ఆశతో కొందరు నేతలు రాజకీయంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్‌లోనూ పోటీకి సై!
బీఆర్ఎస్ నుంచి మోరిల్ శ్రీనివాస్‌రావు (ఎంఎస్ఆర్), షేక్ జుబేర్, అంజిరెడ్డి తదితరులు కూడా అవకాశం లభిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తమ అనుచరుల వద్ద చెబుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వీరిలో ఎవరికి పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పిస్తుంది? భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయి? అన్నది వేచి చూడాల్సిందే.
పునర్విభజన జరిగితే మారనున్న రాజకీయ ముఖచిత్రం!
మొత్తంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాల్సి ఉండగా, తెలంగాణలో మాత్రం ఈ అంశం చుట్టూ రాజకీయ చర్చలు సాగుతున్నాయి. పునర్విభజన జరిగితే బాన్సువాడ రాజకీయాల్లోనూ కొత్త సమీకరణాలు ఏర్పడతాయా? సీనియర్ నాయకులకే మరోసారి అవకాశం దక్కుతుందా? లేక యువత, కొత్తతరం నాయకులు తెరపైకి వస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
చివరికి కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? బాన్సువాడ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments