గాంధారి ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు
రాజస్థాన్లో అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడి అరెస్ట్
కామారెడ్డి అక్టోబర్ 26 నేటి సత్యం ప్రతినిధి
కామారెడ్డి జిల్లా గాంధారిలో ఏటీఎంను గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి రూ.25.45 లక్షలు చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఓ నిందితుడిని రాజస్థాన్లో అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర వెల్లడించారు.
ఏటీఎం చోరీకి పాల్పడిన నిందితుడి నుంచి రూ.29,400 నగదుతో పాటు స్కార్పియో వాహనం, గ్యాస్ కట్టింగ్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీలో మరికొందరు నిందితులు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు, వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మిగతా నిందితులను కూడా త్వరలో పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.