Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogగ్రామ గ్రామాన ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

గ్రామ గ్రామాన ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

నేటి సత్యం శేరిలింగంపల్లి ఏప్రిల్ 13 “సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ మార్గం – ప్రతి గ్రామంలో జయంతి ఘనంగా జరుపుదాం!”

ఏప్రిల్ 14న మహానీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో ఘనంగా నిర్వహించుకోవాలని టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు . పిలుపునిచ్చారు.

భారత రాజ్యాంగ రూపకర్త, పీడిత ప్రజల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన అంబేద్కర్ ఆలోచనలు ఈరోజు మరింత అవసరం అయ్యాయి. సామాజిక అసమానతలు, కుల వివక్ష, ఆర్థిక దోపిడీ పెరుగుతున్న ఈ కాలంలో అంబేద్కర్ చూపిన దారి మాత్రమే సమాన సమాజ నిర్మాణానికి మార్గదర్శకం.

ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలను దెబ్బతీస్తూ, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను అప్పగిస్తున్నాయి. పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబేద్కర్ ఆశయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.

కాబట్టి:

ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించాలి

రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేయాలి

కులవివక్ష, అన్యాయాలపై పోరాటాలకు సిద్ధం కావాలి

యువత అంబేద్కర్ ఆలోచనలను అధ్యయనం చేసి సమాజ మార్పు కోసం ముందుకు రావాలి

“శిక్షణ పొందండి – సంఘటితం అవ్వండి – పోరాడండి” అనే అంబేద్కర్ నినాదాన్ని జీవన మార్గంగా తీసుకుని సామాజిక న్యాయం సాధనకు ముందుకు సాగుదాం.

సిపిఐ పిలుపు:

అంబేద్కర్ జయంతిని కేవలం జ్ఞాపక దినంగా కాకుండా, పోరాట దినంగా మార్చి ప్రతి గ్రామంలో ఉద్యమ స్పూర్తిని నింపుదాం!

జై భీమ్! లాల్ సలామ్!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments