Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకొట్టిమిట్టాడుతున్న పారిశుధ్య కార్మికుని ప్రాణాo

కొట్టిమిట్టాడుతున్న పారిశుధ్య కార్మికుని ప్రాణాo

నేటి సత్యం శేరిలింగంపల్లి ఏప్రిల్ 16 *అధికారుల నిర్లక్ష్యానికి కొట్టిమిట్టాడుతున్న పారిశుద్ధ్య కార్మికుని ప్రాణం*

తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి: కామ్రేడ్ కే యేసు రత్నం మరియు రాష్ట్ర కార్యదర్శి: కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి ఈరోజు ప్రమాదానికి కరెంటు షాక్ తగిలి సనత్ నగర్ ఈ.ఎస్.ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పారిశుద్ధ్య కార్మికుడు ఎం.రాజశేఖర్ ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఏసురత్నం, రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి గార్లు మాట్లాడుతూ శేర్లింగంపల్లి మున్సిపల్ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ఎం.రాజశేఖర్ వయసు 32 సంవత్సరాలు, నివాసం పాపి రెడ్డి కాలనీ లింగంపల్లి, అతనికి భార్య మరియు మూడు సంవత్సరాల ఒక కూతురు ఉన్నారు. శేర్లింగంపల్లి పరిధిలో పారిశుద్ధ్య కార్మికునిగా గత 11 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం అనగా తేదీ:12-4-2026 రోజు ఉదయం 5 గంటలకు విధులకు హాజరు కావడం జరిగింది. పాపి రెడ్డి కాలనీ కమాన్ కు ఫ్లెక్సీలు ఉండడంతో వాటిని తొలగించాలని ఎస్.ఆర్.పి బాల్ రాజు గారు శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్స్ (SFA) వినయ్ కు చెప్పడం జరిగింది. అది కూడా పారిశుద్ధ్య కార్మికుడు ఎం.రాజశేఖర్ అతనితోనే ఫ్లెక్సీలను తొలగించాలని చెప్పడం జరిగింది. SFA వినయ్ వెంటనే ఉదయం:6:30 గంటలకు నువ్వు ప్లెక్సీలు తీయాలని చెప్పడం జరిగింది. ప్రతి సర్కిల్లో ఫ్లెక్సీలను తొలగించే బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ వెహికల్ మీద పనిచేసే వారిది. అధికారులు నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం ఎలాంటి భద్రత లేకుండా పారిశుద్ధ్య కార్మికుని తో పాపిరెడ్డి కాలనీ కమానుకు 20 ఫీట్లపైన ఉన్నటువంటి కమాన్ కు కట్టిన ఫ్లెక్సీలు తీస్తుంటే కమాన్ కు రెండువైపులా విద్యుత్ వైర్లు ఉండడంతో కార్మికునికి కరెంటు వైర్లు తగిలి కరెంటు షాట్ కొట్టడంతో కార్మికుడు 20 ఫీట్ల పైనుండి క్రిందపడి ప్రమాదానికి గురైనాడు. అదేవిధంగా కుడికాలు కూడా విరగడం జరిగింది. మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకు ఏలాంటి బాధ్యత లేకుండా వ్యవహరించడం సరి అయింది కాదు. పై అధికారులు ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఫ్లెక్సీలను తొలగించమని చెప్పినటువంటి ఆర్.ఎస్.పి బాలరాజు ను సస్పెండ్ చేయాలి. ప్రమాదానికి గురైన కార్మికులని కుటుంబాన్ని ఆదుకోవాలి.ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోకపోతే కార్మికులతో కలిసి పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాము.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments