నేటి సత్యం. ఆత్మహత్యలు వద్దు .. తెగించి పోరాడుదాం ఆర్టీసీ కార్మికులతో తగవుపెట్టుకుంటే పతనం తప్పదు
యూనియన్లంటే పాలకులకు భయమెందుకు ప్రజారవాణాను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర
చట్టపరమైన సమ్మెపై నిర్బంధాలెందుకు మొండివైఖరితో ఎమర్జెన్సీ పరిస్థితులు తీసుకొస్తున్నారు
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను నివారించండి డిమాండ్లు పరిష్కరించేవరకు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం
శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
*కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు*
న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లభించకపోవడంతో శుక్రవారం ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాలు, విపక్షాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు, సిపిఐ, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.