అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
—-గన్నేరువరం ఎస్సై జి. నరేందర్ రెడ్డి హెచ్చరిక
గన్నేరువరం, మే 20:(నేటిసత్యం): మండలంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని గన్నేరువరం సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) జి. నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం మండల పరిధిలోని చొక్కారావుపల్లె బిక్క వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా ఎస్సై విలేకరులతో మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘించి ఇసుక రవాణా చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గృహ నిర్మాణాల కోసం ఇసుకను తీసుకెళ్లే వారు ప్రభుత్వానికి డీడీ చెల్లించి, సరైన అనుమతులు పొందాలని సూచించారు.అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒటిపి పద్ధతిలోనే ఇసుకను రవాణా చేయాలని, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేశామని ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు.