Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఈదులకుంట చెరువు పరిరక్షణలో సిపిఐ పోరాటం ఫలించింది

ఈదులకుంట చెరువు పరిరక్షణలో సిపిఐ పోరాటం ఫలించింది

నేటి సత్యం శేరిలింగంపల్లి మే 28

ఈదులకుంట చెరువు పరిరక్షణలో సిపిఐ పోరాటం ఫలించింది*

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఖానామెట్ సర్వే నెంబర్ 7లో ఉన్న సుమారు 6 ఎకరాల 5 గుంటల ఈదులకుంట చెరువు భూమిని కబ్జా నుంచి కాపాడడంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పోరాటం కీలక పాత్ర పోషించిందని పార్టీ నాయకులు తెలిపారు. కోట్ల రూపాయల విలువైన చెరువు భూమిని సర్వే నెంబర్లను తారుమారు చేసి ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తించిన సిపిఐ నాయకులు, అక్కడ జరుగుతున్న సెల్లార్ తవ్వకాల పనులను అడ్డుకుని అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు.

ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసి చెరువు భూమిని రక్షించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అవసరమైతే ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.

అధికారుల నిర్లక్ష్యం ఉన్నప్పటికీ చివరకు హైడ్రా జోక్యంతో చెరువు భూమి రక్షించబడటం ఆనందకరమని సిపిఐ నాయకులు అన్నారు. చెరువును వెంటనే సుందరీకరించి, రానున్న వర్షాకాలంలో పూర్వ వైభవంతో నీటితో నింపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

చెరువు పరిరక్షణ కోసం పోరాడిన ప్రజలు, రిపోర్టర్లు, కార్యకర్తలు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ సిపిఐ పార్టీ తరఫున విప్లవ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు. సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు టి రామకృష్ణ. సిపిఐ శేర్లింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి కే చందు యాదవ్. సిపిఐ జిల్లా సమితి సభ్యులు కే వెంకటస్వామి కే సుధాకర్. జెట్టి శ్రీనివాస్ మండల సహకార దర్శి. కోన సుధాకర్ మండల్ నాయకుడు. తుపాకుల రాములు మండల ఐఐటిసి అధ్యక్షులు. ఎస్ నారాయణ రఘు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments