Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogజాగిలాలతో ముమ్మారంగా గంజాయి తనిఖీ లు

జాగిలాలతో ముమ్మారంగా గంజాయి తనిఖీ లు

నేటి సత్యం గన్నేరువరం జులై 3

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా గంజాయి తనిఖీలు

-గన్నేరువరం పరిధిలో పోలీస్ జాగిలంతో విస్తృత సోదాలు

గంజాయి సమాచారం ఉంటే ‘డయల్ 100’ కి పిలుపునివ్వండి ఎస్సై జి. నరేందర్ రెడ్డి

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నిషేధిత గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించడమే ధ్యేయంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బుధవారం గన్నేరువరం పరిధిలోని గుండ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఎక్స్ రోడ్డు గ్రామంలో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.గుండ్లపల్లి ఎస్సై జి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలం (స్నిఫర్ డాగ్) పాల్గొంది. గ్రామంలోని పలు కిరాణా షాపులు, పాన్ షాపులు, మరియు అనుమానిత ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డాగ్ హ్యాండ్లర్ కానిస్టేబుల్ నితిన్, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, మరియు పోలీస్ కానిస్టేబుల్ సాయిప్రేమ్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై జి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, సమాజానికి పీడకలగా మారిన గంజాయి, మత్తుపదార్థాల నిర్మూలనకు ప్రజలు బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు. ఎవరి వద్దనైనా ప్రభుత్వం నిషేధించిన గంజాయి ఉన్నా, లేదా ఎవరైనా వాటిని విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసినా వెంటనే ‘డయల్ 100’ కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచబడతాయని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments