Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogసిద్దాపూర్ రిజర్వాయర్ పై రివ్యూ..!

సిద్దాపూర్ రిజర్వాయర్ పై రివ్యూ..!

నేటి సత్యం కామారెడ్డి జూలై16

సిద్ధాపూర్ రిజర్వాయర్ పై రివ్యూ నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం

హైదరాబాద్ , పబ్లిక్ గార్డెన్స్ లోని తన కార్యాలయంలో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు

సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా, గత నెల 23 మే 2026న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం చెల్లించి అవసరమైన అనుమతులు పొందేందుకు రూ. 55.30 కోట్లను మంజూరు చేస్తూ జి.ఓ. నం. 37 ద్వారా 08 జూన్ 2026న ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో

సిద్దాపూర్ రిజర్వాయర్ పురోగతిపై ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేందుకు సంబంధిత అటవీ శాఖ అధికారులు PCCF శ్రీ శ్రావణ్ గారు ( నోడల్ ఆఫీసర్ ) మరియు ఇరిగేషన్ అధికారులు ENC శ్రీనివాస్ కామారెడ్డి ఇంచార్జి CE దక్షిణామూర్తి బాన్సువాడ EE రాజశేఖర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించి, భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన నాణ్యతలోపం లేకుండా పూర్తి చేయాలని అధికారులకు పోచారం సూచించారు రిజర్వాయర్ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేసేందుకు ఆయన తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు దీంతో ఆయకట్టు రైతులు పోచారం కు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments