నేటి సత్యం గండిపేట్ జులై 26
కార్మికుల హక్కులను కాపాడే ఏకైక సంఘం ఏఐటీయూసీ
జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు
దేశంలో శ్రమజీవుల హక్కులను కాపాడే కార్మిక సంఘం ఒక్క ఏఐటీయూసీ మాత్రమే అని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు అన్నారు
ఆదివారం నాడు గండిపేట మండలం నాలుగవ ఏఐటియుసి మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు
మహాసభ సీనియర్ నాయకులు శంకరయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ స్వాతంత్రము రాకముందు పోరాడి సాధించుకున్న చట్టాలు కొన్ని స్వాతంత్రం అనంతరం సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కి నాలుగు లేబర్ కోడులను తీసుకొచ్చిందని దీనివల్ల అనేక సంవత్సరాలుగా పొందుతున్న కార్మిక చట్టాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు
కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని జీతభత్యాలు అలవెన్సులు పెరగకపోవడం వల్ల అనేక ఆర్థిక అసమానతలు ఎదుర్కొంటున్నారని నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుల జీవితాలను ఆగం చేస్తున్నాయని ఆయన తెలిపారు
ధరలను అదుపు చేయలేని అసమర్థ ప్రభుత్వాలు నేడు ప్రజలను పాలిస్తున్నాయని పెరిగే ధరలకు హద్దు లేదు ఏలే పాలకులకు సిగ్గు లేదని ఆయన విమర్శించారు
తుక్కుగూడలో ఆగస్టు 2న జరిగే మహాసభలలో జిల్లాలో కార్మికుల సమస్యలు పై తీర్మానాలు చేసి భవిష్యత్తు ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తామని పర్వతాలు తెలిపారు
ఈ మహాసభలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎస్ మల్లేష్ మాట్లాడారు
అనంతరం నూతన కమిటీని 15 మందితో ఎన్నుకున్నారు
గౌరవ అధ్యక్షునిగా ఎం శంకరయ్య
అధ్యక్షునిగా శివ కార్యనిర్వాక అధ్యక్షునిగా భాస్కర్
మండల ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్ వీరితోపాటు ఆఫీస్ బేరర్స్ 9 మంది ఎన్నికయినారని పర్వతాలు తెలిపారు