నేటి సత్యం శేర్లింగంపల్లి ఆగస్టు 6
ఘనంగా అంబేద్కర్ నగర్ లో పోచమ్మ తల్లి ఆలయ 5వ వార్షిక మహోత్సవం..
అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహణ…
హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ బస్తీలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవి అమ్మవారి 5వ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ స్థానిక నాయకులు, భక్తులు, ప్రజలతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వి.జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ పోచమ్మ దేవి అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్, కనకమామిడి నరేందర్ గౌడ్, ధాత్రినాథ్ గౌడ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, నిమ్మల రామకృష్ణ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గుప్తా, పాండు ముదిరాజ్, దేవ, హేమంత్ గౌడ్, బస్తీ అధ్యక్షులు కేశవ్, వంశీ, రత్నాచారి, అంబేద్కర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శోభన్, గోపాల్, యాదగిరి, సీతారాం, రాజు, నరేందర్, మహేష్ కుమార్,వినోద్ కుమార్, సాయినాథ్, జ్ఞానేశ్వర్, ఎర్ర మహేష్, బాబీ, సురేష్, శ్రవణ్, స్థానిక ప్రజలు ,భక్త మహాశయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.