నేటి సత్యం ఆగస్టు 10
నిండుకుండలా నిజం సాగర్ డ్యాం
ఆనందం వ్యక్తం చేస్తున్న రైతన్నలు
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజం సాగర్ ప్రాజెక్టులోకి మంజీర పరీవాహక ప్రాంతం నుండి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రస్తుతం నిజం నిండుకుండలా కనిపిస్తుంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం స్థిరమైన ప్రవాహం కొనసాగుతోంది ఇరిగేషన్ అధికారులు చెబుతున్న తాజా అప్డేట్ ప్రకారం
గత 24 గంటల్లో ప్రాజెక్టు లోకి చేరిన 3985 క్యూసెక్కుల వరద నీరు చేరిందని
ప్రాజెక్టు నీటిమట్టం 1405.00 అడుగులు.
ప్రాజెక్టు కెపాసిటీ 17.802 టి ఎం సి లు.
ప్రస్తుత నీటిమట్టం 1400.50 అడుగులు
ప్రస్తుత కెపాసిటీ 11.891 టి ఎమ్ సి లు.
ప్రస్తుతం నీటి మట్టం గమనిస్తే అనుకున్న స్థాయికి చేరిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు రైతన్నలకు ఈసారి ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు తెలిపారు దీంతో కొందరు రైతులు ఆలస్యం అయినప్పటికీ వరి నాట్లు వేసుకుంటున్నారు
