నేటి సత్యం ఆగస్టు 12
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి బాబును పరామర్శించిన తెలంగాణ రాష్ట్రఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి బాబు గారు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని,వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి గారు.
ఈ సందర్భంగా ఇమ్మడి బాబు గారితో మాట్లాడి,త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి,అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఇమ్మడి బాబు గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
ఈ కార్యక్రమంలో47 డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ సందెల విజయ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోయిన కుమార్ యాదవ్ గారు,జగదీష్ రెడ్డి గారు,రావుల విద్యాసాగర్ గారు,సత్యవరం మధుకర్ గారు,అశోక్ గారు,రాజి రెడ్డి గారు,సురేందర్ గారు, దేవర రమేష్ గారు,మహమూద్ గారు చోటు,యాసీన్,చిన్న,మరియు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు
నేటి సత్యం ప్రతినిధి కొమెర యాకయ్య