నేటి సత్యం/ శేర్లింగంపల్లి / ఆగస్టు 13
తీవ్ర విషాదం.. రాగం సుజాత యాదవ్ కన్నుమూత
రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు శ్రీమతి రాగం సుజాత యాదవ్ గారు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
1974 అక్టోబర్ 10న జన్మించిన రాగం సుజాత యాదవ్ గారి మరణం (13.08.2026) మహిళా లోకంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు తీరని లోటు. ప్రజా సేవలో, మహిళల సంక్షేమం కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం.
ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.
పార్థివదేహం సందర్శనకు:
నల్లగండ్లలోని వర్టెక్స్ కింగ్స్టన్ స్వగృహంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి సందర్శకుల దర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచనున్నారు.
అంత్యక్రియలు:
రేపు ఉదయం 11 గంటలకు నల్లగండ్లలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించబడతాయి.