నేటి సత్యం / మహబూబాబాద్/ ఆగస్టు 13
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు – 15 లీటర్ల గుడుంబా స్వాధీనం
తొర్రూరు మండలం భీముని తండాలో గుడుంబా తయారీ, విక్రయాలపై తొర్రూరు పోలీసులు తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 250 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.
గుడుంబా తయారీ, విక్రయాలు, అక్రమ మద్యం కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అక్రమ మద్యం తయారీ లేదా విక్రయాల సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
నేటి సత్యం ప్రతినిధి కొమెర యాకయ్య