Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlog12 రకాల లో ఒక్కటి ఉన్న ఓటును కాపాడుకోవచ్చు..

12 రకాల లో ఒక్కటి ఉన్న ఓటును కాపాడుకోవచ్చు..

నేటి సత్యం/ శేరిలింగంపల్లి / ఆగస్టు 13

ఎస్ ఐ ఆర్ లో పేరు తొలగించిన ఓటర్లు ఆందోళన చెందవద్దు

12 రకాల పత్రాల్లో అందుబాటులో ఉన్న ఆధారాలతో హక్కును కాపాడుకోండి

*సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ*

ఓటర్ల సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ లో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించబడిన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తెలిపారు.

పేరు జాబితాలో లేకపోయినా, ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం సంబంధిత అధికారులు నోటీసు ఇచ్చిన సమయంలో అర్హతను నిరూపించేందుకు పత్రాలు సమర్పించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

                                     

12:ఆధారాలు

ప్రజలు తమ వద్ద అందుబాటులో ఉన్న ఆధారాలను సిద్ధంగాఉంచుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా జనన ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్, 10వ తరగతి సర్టిఫికెట్, శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఫ్యామిలీ రిజిస్టర్, భూమి/ఇంటి కేటాయింపు పత్రాలు, ఆధార్ తదితర 12 రకాల పత్రాలను ఎన్నికల సంఘం సూచించిన ఆధారాలుగా పరిగణిస్తున్నట్లు తెలిపారు.

ఒక్క అర్హత కలిగిన ఓటును కూడా తొలగించకూడదు అని టి. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని, అధికారులు పారదర్శకంగా వ్యవహరించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటర్ల జాబితాలో కొనసాగించాలని కోరారు.

ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, పేరు తొలగించబడిన అర్హులైన ఓటర్లకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments