Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

ఇల్లు విద్యా వైద్యం ఉపాధి కై పోరాటాలకు సిద్ధం కండి

నేటి సత్యం/ హైదరాబాద్ /సెప్టెంబర్ 18

దళితుల భూమి, ఇల్లు, ఉపాధి హక్కులకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. బాల నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణలో దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం స్పష్టమైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బాల నరసింహ డిమాండ్ చేశారు. దళితుల అభివృద్ధి కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా భూమి,ఇల్లు,ఉపాధి అనే మూడు ప్రాథమిక హక్కుల చుట్టూ సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఆయన కోరారు.భూమిలేని దళిత కుటుంబాలను గుర్తించి ప్రభుత్వ, మిగులు, అసైన్డ్ భూములను పంపిణీ చేయాలని కోరారు. ఇప్పటికే పట్టాలు పొందిన దళిత రైతులకు సాగునీరు, భూమి అభివృద్ధి, వ్యవసాయ పెట్టుబడి, మార్కెట్ సదుపాయాలు కల్పించాలని అన్నారు. గతంలో అమలైన భూ పంపిణీ పథకాలపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని సూచించారు.ఇల్లు లేని దళిత కుటుంబాలకు ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం, మౌలిక సదుపాయాలు అందించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో దళితులకు స్పష్టమైన ప్రాధాన్యత, పారదర్శక ఎంపిక ఉండాలని, పట్టణాల్లో అద్దె ఇళ్లలో నివసించే పేద దళితుల కోసం ప్రత్యేక గృహ విధానం రూపొందించాలని కోరారు.దళిత యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు స్వయం ఉపాధికి తక్కువ వడ్డీ రుణాలు, సబ్సిడీలు, నైపుణ్య శిక్షణ అందించాలని అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ కొనుగోళ్లలో అవకాశాలు కల్పించాలని కోరారు.ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధులు పూర్తిగా దళితుల అభివృద్ధికే ఖర్చయ్యేలా చట్టబద్ధ పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి, నిధుల కేటాయింపు, విడుదల, ఖర్చు వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని బాల నరసింహ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మారూపాక అనిల్ కుమార్ , తాళ్లపల్లి లక్ష్మణ్, సలిగంటి శ్రీనివాస్, కే రత్నకుమారి వైశాశ్రీ టి రామకృష్ణ ,కే వెంకటస్వామి, కే రాజరత్నం బి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments