నేటి సత్యం /కొల్లాపూర్ /సెప్టెంబర్ 19
పితృవియోగం లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ని పరామర్శించిన కేటీఆర్ …
పితృ వియోగం లో ఉన్న కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి ని వారి కుటుంబ సభ్యులను భారత రాష్ట్ర సమితి( బి ఆర్ ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రోజు కలిసి పరామర్శించారు.
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి (87) గురువారం రోజు అనారోగ్య కారణాలతో మరణించగా ఆయన అంత్యక్రియలను శుక్రవారం రోజు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం లోని ఎత్తం గ్రామ శివారులో ఉన్న వారి వ్యవసాయ క్షేత్రం లో నిర్వహించారు.
లక్ష్మారెడ్డి అంత్యక్రియల కార్యక్రమానికి శుక్రవారం రోజు కేటీఆర్ వస్తున్నారని బి ఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేసినప్పటికీ కేటీఆర్ శుక్రవారం రోజు లక్ష్మారెడ్డి అంత్యక్రియలో పాల్గొన లేక పోయారు.
కాగా శనివారం రోజు ఉదయం కేటీఆర్ ఎత్తం గ్రామ శివారులో ఉన్న కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి
మృతుడు లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.
పితృ వియోగం లో ఉన్న హర్షవర్ధన్ రెడ్డి ని కేటీఆర్ ఆలింగనము చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించి లక్ష్మారెడ్డి మృతి కి సంతాపాన్ని వ్యక్తం చేశారు.
కాగా హర్షవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వారి వ్యవసాయ క్షేత్రానికి కేటీఆర్ రావడం తోనే అక్కడ వేసి ఉన్న బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జై కేసి ఆర్, జై జై కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు.
బీరం హర్షవర్ధన్ రెడ్డి నీ పరామర్శించడానికి వచ్చిన కేటీఆర్ వెంట మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఆశన్నగారి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
హర్షవర్ధన్ రెడ్డిని కలిసి పరామర్శించిన కేటీఆర్ బీరం వ్యవసాయ క్షేత్రం నుండి కొల్లాపూర్ కు వెళుతుండగా కూడా బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మళ్లీ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ దగ్గరగా నినాదాలు చేస్తూ కేటీఆర్ తో కరాటాలను చేసేందుకు పెద్ద పెట్టిన ముందుకు రావడం తో అభిమానుల ఉత్సాహంలో కేటీఆర్ తల మునకలయ్యారు. కొల్లాపూర్ నుండి చిన్నంబావి మండల కేంద్రం లో ఉన్న బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు స్వగృహానికి కేటీఆర్ తరలి వెళ్లారు.
నేటి సత్యం కొల్లాపూర్ ప్రతినిధి మల్లికార్జున్ కేటీఆర్