Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

కైలాస్ నాలా ప్రాజెక్టు కు పొంచి ఉన్న వరద ముప్పు

కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌కు వరద ముప్పు

ఇన్‌ఫ్లోలు పెరిగే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
కామారెడ్డి సెప్టెంబర్ 23 నేటి సత్యం ప్రతినిధి కౌలాస్ నాలా ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో ప్రాజెక్ట్‌కు వచ్చే వరద ప్రవాహాలు పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటిమట్టం 457.83 మీటర్లు ఉండగా, గరిష్ట నీటి నిల్వ మట్టం 458.00 మీటర్లుగా ఉంది.
ఇన్‌ఫ్లో పరిస్థితులను బట్టి ప్రాజెక్ట్ వరద గేట్లను ఎత్తి అదనపు నీటిని కౌలాస్ నాలా వాగులోకి విడుదల చేయాల్సి రావచ్చని అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో దిగువ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చేపలు పట్టేవారు, పశువులు, గొర్రెల కాపరులు, రైతులు, ప్రజలు వాగులోకి లేదా పరిసర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు.
గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే పరిస్థితి ఏర్పడితే ముందస్తుగా ప్రత్యేక హెచ్చరిక ద్వారా సమయం, నీటి విడుదల వివరాలు తెలియజేస్తామని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments