Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

బాన్సువాడలో జర్నలిస్టుల శిక్షణ

బాన్సువాడలో జర్నలిస్టుల శిక్షణకు ఏర్పాట్లు
కామారెడ్డి సెప్టెంబర్ 24: నేటి సత్యం ప్రతినిధి బాన్సువాడలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణా తరగతుల ఏర్పాట్లను తెలంగాణ మీడియా అకాడమీ బృందం గురువారం పరిశీలించింది.
తెలంగాణ మీడియా అకాడమీ, TUWJ-IJU సంయుక్త ఆధ్వర్యంలో దేశాయిపేటలోని SRNK డిగ్రీ కళాశాలలో శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఓఎస్డీ రెహమాన్, మేనేజర్, జిల్లా యూనియన్ అధ్యక్షులు రజనీకాంత్ కళాశాలలోని సెమినార్ హాల్, లంచ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్‌లను పరిశీలించారు. ఏర్పాట్లపై కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్‌కు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 120 మంది జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తున్నామని, ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. పాల్గొనే వారికి మెటీరియల్, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.
జిల్లా జర్నలిస్టులు ఈ శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వర్క్‌షాప్ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments