Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogవరస ప్రమాదాలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి

వరస ప్రమాదాలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి

*వరుస ప్రమాదాలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి*.*సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.*

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ గేటు వద్ద నిన్న జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి నేడు సిపిఐ కుత్బుల్లాపూర్ మండల సమితి తరపున గాంధీనగర్ ఏఐటీయూసీ కార్యాలయం వద్ద నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే బస్సు ప్రమాదాలు జరగడం అందులో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండడం సమాజాన్ని కలిచి వేస్తుందని, ప్రమాదం జరిగిన సమయంలో అధికారులు హడావుడి చేయడమే గాని ఆ తర్వాత రెగ్యులర్ చెకప్ లు లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిన సంఘటనగా కనిపిస్తుందని అన్నారు. ఒకవేళ అక్కడ భారీ గుంత లేకుండా ఉండి ఉంటే ఇలాంటి సంఘటన జరగకపోయేదని కావున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ల పేరుతో డబ్బులు ఇచ్చి చేతులు దులుపు కోకుండా రోడ్డు ప్రమాదాలకు కారణమైనటువంటి అధికారులను సస్పెండ్ చేసి రవాణా శాఖ అధికారులు నిత్యం చెకప్ లు చేసుకుంటూ ఉంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగవు అని అన్నారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు చనిపోవడం, అనేకమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోవడం వారి ఆవేదనలు, ఆక్రందనలు తీర్చలేమని కావున ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి అధికారులతో సక్రమంగా పని చేయించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు సిపిఐ తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు.

*ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కే స్వామి, సహాయ కార్యదర్శి హరినాథ్ రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సిపిఐ నాయకులు హరీష్ రెడ్డి, మల్లారెడ్డి, గౌస్, ఎల్లయ్య, వెంకటేష్, జంబు, నారాయణ తదితరులు పాల్గొన్నారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments