వీధి కుక్కల బెడద తో ప్రజలు ఆందోళన
మూడు సంవత్సరాల చిన్నారి పై వీధి కుక్కల దాడి
కామారెడ్డి జూలై 30 (నేటి సత్యం ప్రతినిధి) పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వీధి కుక్కల బెడద రోజురోజుకు తీవ్రమైపోతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు, రాత్రి సమయాల్లో నడిచి వెళ్లేవారు ద్విచక్ర వాహనదారుల పై వీధి కుక్కలు గుంపులుగా దాడి చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి నిదర్శనం బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో మూడు సంవత్సరాల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కుక్కల గుంపును చద రకొట్టి చిన్నారిని కాపాడారు చిన్నారిని హుటాహుటిన బాన్సువాడ మాత శిశు ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం, మాంసపు వ్యర్థాలను పార వేయడం వల్ల కుక్కలు గుంపులుగా చేరుతున్నాయి స్థానిక మున్సిపాలిటీలు అలాగే గ్రామ పంచాయతీలలో కుక్కల సంతానోత్పత్తిని అరికట్టే ఆపరేషన్లు క్రమం తప్పకుండా జరగకపోవడం రోజురోజుకు వీటి సంఖ్య పెరిగిపోతుంది పెద్దలతో పోలిస్తే చిన్న పిల్లలు తమను తాము రక్షించుకోలేకపోవడం వల్ల కుక్కలు ఎక్కువగా వారిని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేసి వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు రేబిస్ టీకాలు వేయించాలి. వీధుల్లో చెత్తాచెదారం, హోటల్ వ్యర్థాలు పడవేయకుండా నిరోధించాలి. ప్రజలు వీధి కుక్కల సమస్యపై స్థానిక పురపాలక సంఘం అధికారులకు లేదా ప్రత్యేక హెల్ప్లైన్లకు సమాచారం అందించాలి. రాత్రి వేళల్లో ఒంటరిగా నడిచేటప్పుడు లేదా పిల్లలను బయటికి పంపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలు వెంబడిస్తే పరుగెత్తకుండా నిలబడటం లేదా ప్రశాంతంగా ఉండటం శ్రేయస్కరం అంటున్నారు పలువురు అనుభవజ్ఞులు ఇది ఇలా ఉండగా సుప్రీంకోర్టు సైతం వీధి కుక్కల విషయంలో ప్రభుత్వాలను సీరియస్ గా హెచ్చరించిన ఫలితం లేకుండా పోతుంది ఇప్పటికైనా వీటిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు