నేటి సత్యం
అమెరికా–ఇజ్రాయిల్ యుద్ధ ధోరణిని నిలిపివేయాలి – ప్రజలపై పెట్రోల్, డీజిల్, ఎల్పిజి భారం మోపవద్దు సిపిఐ రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శేర్లింగంపల్లి ఆధ్వర్యంలో కొండాపూర్ చౌరస్తాలో 12 గంటలకు యుద్ధం ఆపాలి పెంచిన ఎల్పిజి గ్యాస్ రేట్లు తగ్గించాలి పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడకుండా చూడాలి అని నిరసన ధర్నా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మాట్లాడుతూ
మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా–ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై పెంచుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి. ఈ యుద్ధ ధోరణి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగి, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలపై భారీ భారం పడుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఎల్పిజి గ్యాస్ ధరలను పెంచడం అత్యంత అన్యాయం. వంట గ్యాస్ ధరల పెరుగుదలతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఎల్పిజి గ్యాస్ సరఫరా కూడా సరిగా జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అందువల్ల వెంటనే అమెరికా–ఇజ్రాయిల్ ప్రభుత్వాలు ఇరాన్‌పై యుద్ధ చర్యలను నిలిపివేసి ప్రపంచ శాంతిని కాపాడాలి. అలాగే భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి. పెంచిన ఎల్పిజి గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు సరసమైన ధరలకు గ్యాస్ అందుబాటులో ఉంచాలి.
ప్రజలపై పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సిపిఐ పార్టీ. ప్రజాసంఘాలు, ప్రజలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి మండల కార్యదర్శి కె చందు యాదవ్. డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి కె వెంకటస్వామి. ఏఐటియుసి మండల అధ్యక్షులు తుపాకుల రాములు. జెట్టి శ్రీనివాస్. హఫీజ్పేట్ సిపిఐ కార్యదర్శి బినారాయణ. కె కాసిం. డిహెచ్పిఎస్ శేరిలింగంపల్లి మండల కార్యదర్శి ఎస్ కొండలయ్య. ఏ ఐ వై ఎఫ్ శేర్లింగంపల్లి మండల కార్యదర్శి కే శివకుమార్. ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు కార్యదర్శి. టి నితీష్. ధర్మ తేజ రఘు.తదితరులు పాల్గొన్నారు