Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogధరలను అదుపు చేయలేని దద్దమ్మ ప్రభుత్వాలు జంగయ్య

ధరలను అదుపు చేయలేని దద్దమ్మ ప్రభుత్వాలు జంగయ్య

నేటి సత్యం శంషాబాద్ మే 16

ధరలు అదుపు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం కేంద్రంలో పాలిస్తున్నది

. మోడీ హాయంలో కార్పొరేట్లు పెట్టుబడిదారులు లాభాలు అర్జిస్తున్నారు

సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య

ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని కార్పొరేట్ దోపిడిదారులకు అనుకూలంగా ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సిపిఐ జిల్లా కార్యదర్శి జాతీయ నాయకుడు పాలమాకుల జంగయ్య

నిన్న కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ పై మూడు రూపాయల చొప్పున ధరలు పెరిగాయని ఈ ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని జంగయ్య విమర్శించారు

శనివారం నాడు పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ సిపిఐ శంషాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన పాల్గొన్నారు

ప్రజలను కార్యకర్తలు నిర్దేశించి ఆయన మాట్లాడారు

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ దోపిడి వర్గాలకు కొమ్ముకాస్తూ సామాన్య ప్రజలను గాలికి వదిలేసిందని దాని ఫలితంగానే వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు

ప్రజలు తిరుగుబాటు వైపు రాకుండా మతాన్ని కులాన్ని జైశ్రీరామ్ నినాదాలతో పక్కదారి పట్టించే ప్రయత్నం బిజెపి ప్రభుత్వం చేస్తున్నదని ఆయన విమర్శించారు

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ

కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ.ఎన్నికలకు ముందు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు.ఏ ఒక్క హామీ అమలు చేయలేదని పర్వతాలు మండిపడ్డారు

అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ పైన చేస్తున్న యుద్ధం వల్ల పెట్రోల్ డీజిల్ వంటగ్యాస ధరలు పెరుగుతున్నాయని దీనిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు

ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ యాదగిరి మండల కార్యదర్శి కే చందు యాదవ్.నాయకులు చంటి శ్రీనివాస్ నారాయణ రఘు మధు శ్రీను అనిత తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments