Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogదేశ స్వతంత్రం కోసం ఆవిర్భవించిన ఏఐఎస్ఎఫ్

దేశ స్వతంత్రం కోసం ఆవిర్భవించిన ఏఐఎస్ఎఫ్

నేటి సత్యం హైదరాబాద్ జూన్ 4

దేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భవించిన ఎఐఎస్ఎఫ్

*దేశ అభివృద్ధిలో విద్యార్ధుల పాత్ర ఎంతో కీలకం*

*సమరశీల ఉద్యమాల ద్వారానే విద్యారంగ సమస్యలు పరిష్కారం*

*సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు*

*ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు ప్రారంభం*

భారత దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) ఆవిర్భావించిందని, నాటి నుంచి నేటి వరకు 90 సంవత్సరాలుగా దేశ సమగ్రతపై, విద్యారంగ సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ అని, నేటి విద్యార్దులే రేపటి దేశ భవిష్యత్ అని, దేశ అభివృద్ధిలో విద్యార్థుల భాగస్వామ్యం తప్పనిసరి అని, వారి పాత్ర ఎంతో కీలకమని, ఏ సమాజానికైనా అవసరమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, వైజ్ఞానిక, మానవీయ విలువలు ఇచ్చే సాధన విద్యాని, ఆ విద్యనే నేటి పాలకులు భ్రష్టుపట్టుస్తున్నారని, ప్రభుత్వ విద్య పరిరక్షణకై, విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. గురువారం హిమాయత్ నగర్ లోని మగ్ధూం భవన్ లో జూన్ 4 నుంచి 6 తేది వరకు మూడు రోజుల పాటు జరిగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, సైద్ధాంతిక, రాజకీయ శిక్షణ తరగతులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శిక్షణ తరగతుల ప్రారంభానికి ముందు ఏఐఎస్ఎఫ్ శ్వేతాఅరుణ పతకాన్ని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్ ఎగురవేశారు. అనంతరం ఈ శిక్షణా తరగతుల ప్రారంభ సభకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శిక్షణా తరగతులను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చెర నుంచి మాతృభూమి విముక్తికై 1936 ఆగస్టు 12న ఎఐఎస్ఎఫ్ ఆవిర్భావించి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిందని ఏకైక విద్యార్థి సంఘమని, పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్ర్య అనంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, శాస్త్రీయ విద్య, కామన్ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ అని అన్నారు. దేశంలో ఏర్పడిన మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని, భారత స్వాతంత్ర్య ఉద్యమం నుంచి సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ వరకు ప్రతి చారిత్రాత్మక పోరాటంలో ఏఐఎస్ఎఫ్ తనదైన ముద్ర వేసిందన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ నేలపై సాగిన వీరోచిత పోరాటాల్లోనూ ఏఐఎస్ఎఫ్ శ్రేణులు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. విశాలాంధ్ర ఉద్యమం, విద్యా హక్కుల సాధన, దేశంలోని ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఉచిత విద్య కోసం జరిగిన ఉద్యమాల్లో ఏఐఎస్ఎఫ్ ముందుండి పోరాడిందన్నారు. దేశ విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన కొఠారి కమిషన్ సిఫారసులు రూపుదిద్దుకునే ప్రక్రియలోనూ విద్యార్థి ఉద్యమాల ఒత్తిడి కీలకమైందని, అందులో ఏఐఎస్ఎఫ్ పాత్ర చారిత్రాత్మకమని పేర్కొన్నారు. సైంటిఫిక్, సెక్యులర్, సోషలిస్టు విలువలతో కూడిన విద్యా విధానం కోసం అనేక దశాబ్దాలుగా ఏఐఎస్ఎఫ్ నిరంతర పోరాటాలు కొనసాగిస్తోందని తెలిపారు. నేడు విద్యను హక్కుగా కాకుండా వ్యాపార వస్తువుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం అత్యంత అవసరమన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వ విద్యాసంస్థల పరిరక్షణ కోసం విద్యార్థి నాయకులు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. త్యాగాలు, పోరాటాలు, సిద్ధాంతబద్ధతతో నిర్మితమైన ఏఐఎస్ఎఫ్ గొప్ప వారసత్వాన్ని నేటి తరం విద్యార్థి నాయకులు ముందుకు తీసుకెళ్లాలని, విద్యా హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థి ఉద్యమం కేవలం సమస్యల పరిష్కారానికే పరిమితం కాకుండా సమాజ మార్పుకు మార్గదర్శక శక్తిగా ఎదగాలని సూచించారు.

“మార్క్సిజం – సమకాలీన ప్రాధాన్యత” అంశంపై ప్రముఖ వక్త కామ్రేడ్ మధుకర్ లోతైన విశ్లేషణాత్మక క్లాసు బోధించారు.

“తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో భారత దేశం పర్యవసానాలు” అంశంపై ప్రముఖ వక్త కామ్రేడ్ బి ఎస్ ఆర్ మోహన్ రెడ్డి బోధించారు.

ఈ శిక్షణ తరగతులతలో ఏఐఎస్ఎఫ్ పూర్వ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలి ఉల్లాఖాద్రి, జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్, ఏఐఎస్ఎఫ్ పూర్వ రాష్ట్ర నాయకులు మంద పవన్, రామావత్ అంజయ్య నాయక్, పల్లె నరసింహ, మారుపాక అనిల్ కుమార్, లక్ష్మీ నారాయణ, ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బెరర్స్ గ్యార నరేష్, రెహమాన్, బానోత్ రఘురాం, సి. రాజు, బాలసాని లెనిన్, కాసోజు నాగజ్యోతి లతో పాటు 31 జిల్లాల, వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments