నేటి సత్యం శేరిలింగంపల్లి జూన్ 29
జులై 1న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి
పేదలకు ఇంటి స్థలాలు – ఇంటి పట్టాలు వెంటనే ఇవ్వాలి
టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
రాష్ట్రంలో లక్షలాది మంది పేదలు సొంత ఇంటి స్థలం, ఇంటి పట్టా కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. భూమిలేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రామకృష్ణ మండిపాడారు .
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ గారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు అర్జీలు పెట్టుకున్న పేద ప్రజలు అధికంగా ఉన్నారు. వారికి వెంటనే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ పార్టీ చలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యక్రమం నిర్వహిస్తుంది శేరిలింగంపల్లి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయండి
ఒకవైపు పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలం లేదని, మరోవైపు ప్రభుత్వ భూములు కార్పొరేట్ సంస్థలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతున్న తీరు తీవ్రంగా ఖండించదగినది. పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.
ఇంటి స్థలాలు – ఇంటి పట్టాలు సాధించుకునేందుకు జులై 1న నిర్వహించే కలెక్టరేట్ ముట్టడిని ఇల్లు లేని ప్రజలు, నిరుపేదలు, కార్మికులు, రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. ప్రజల హక్కుల కోసం జరిగే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
ప్రభుత్వం వెంటనే అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం, ఇంటి పట్టా మంజూరు చేయాలని, ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన ప్రజా ఉద్యమాలు భూ పోరాటాలు చేపడతామని హెచ్చరిస్తున్న. టి రామకృష్ణ
పేదల హక్కుల కోసం… పోరాటమే మార్గం!
జులై 1 కలెక్టరేట్ ముట్టడి – అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయండి!