Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogవివిధ పార్టీల నుండి సిపిఐ లో చేరిక..!

వివిధ పార్టీల నుండి సిపిఐ లో చేరిక..!

నేటి సత్యం శంషాబాద్ జులై 7

టిఆర్ఎస్ ఇతర ప్రజాసంఘాల నుండి సిపిఐ మండల కార్యదర్శి నర్రగిరి సమక్షంలో 50 మంది సిపిఐ లో చేరిక

.భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ వ్యాపితంగా నిర్వహిస్తున్న ప్రజా పోరాటాలను గుర్తించి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న ఉద్యమాలను చూసి ఆకర్షించబడిన టిఆర్ఎస్ ఇతర ప్రజా సంఘాల నుండి ఈరోజు 50 మంది సిపిఐ పార్టీ మండల కార్యదర్శి నర్రగిరి సమక్షంలో ఎర్ర కండువాలు కప్పుకొని సిపిఐలో చేరారని శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి తెలిపారు.

శంషాబాద్ మండల ప్రాంతం ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన దండి రవికుమార్, గోపాల్ తోపాటు 50 మంది పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా నర్రగిరి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నిరంతరం పేద ప్రజల సమస్యల మీద ఆందోళన పోరాటాలు నిర్వహిస్తుంది. పేద ప్రజలు బ్రతకడానికి నివసించడానికి ఇండ్లు లేని వారికి 60 గజాల ఇండ్ల స్థలాలు ఇవ్వాలని. ఇండ్ల స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్ల పేరుమీద ప్రభుత్వం గుర్తించి ఐదు లక్షల రూపాయలు వారికి ఇండ్లు నిర్మించుకోవడానికి ఇవ్వాలని. అనేక సమస్యల మీద పోరాడుతున్న పేద ప్రజలకు దిక్కు ఎర్రజెండా అన్నారు.

శంషాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ భూములను గుర్తించి రాబోయే కాలంలో ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్ల స్థలాల కోసం భూ పోరాటాలు నిర్వహిస్తామని నర్రగిరి తెలిపారు. పార్టీలో చేరిన వారు. శివ యాదవ్, నరేష్ యాదవ్, బాలస్వామి, వెంకటయ్య, మహేష్, జంగయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments