నేటి సత్యం హైదరాబాద్ జూలై 9
డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడించిన ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్టు శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులు
పోలీసులు కార్మికుల మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్తత
కార్మికులకు కనీస వేతనాలు పెంపు, 1వ తారీఖున జీతాల విడుదలకు యూనియన్ డిమాండ్
ధర్నాకు దిగివచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన డీఎంఈ
సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడుతూనే ఉంటాం యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండి యూసుఫ్
ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ పిలుపు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయుచున్న కాంట్రాక్టు శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు 1వ తేదీన జీతాలు రాకపోవడం, జీతాలు చెల్లించేందుకు ఈ కార్మికులను కాంట్రాక్టు కార్మికులుగా కూడా పరిగణలోకి తీసుకోకపోవడం కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యమని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గత రెండు రోజులుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ధర్నాలు నిర్వహించి నేడు కోటీలోని డిఎంఈ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది.
ఈ సందర్భంగా ఉదయం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్మికులు , పోలీసుల భారీ కేడ్లను తోసివేసి డీఎంఈ కార్యాలయంలోకి తెచ్చుకొని వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు కార్మికులకు జరిగిన తోపులాటలో అనేకమంది కార్మికులకు గాయాలు కావటం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఎం నరసింహాలు మాట్లాడుతూ గతంలో అనేక పర్యాయాలు ధర్నాలు నిర్వహించి డిఎంఈ అధికారులకు వినతి పత్రాలు సామరస్య పూర్వకంగా ఇవ్వడం జరిగిందని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఒకవైపు ముఖ్యమంత్రి 1వ తేదీన కాంట్రాక్టు కార్మికులకు, ఔట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు చెల్లించాలి అని చెబుతున్న ఈ కాంట్రాక్టు కార్మికుల్ని అందులో పరిగణలోకి తీసుకోకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారు విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయుచున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు అతి తక్కువ జీతాలతో శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని కనీస వేతనం 26,000 చెల్లించాలని, కాంట్రాక్టు చట్టం ప్రకారం 23 సెలవులు అమలు చేయాలని, ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ చట్టాలను అతిక్రమిస్తూ కార్మికులకు అధికారులు తీవ్ర అన్యాయం చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లో యూనియన్ సహించబోదని వారు వెల్లడించారు. తక్షణం అధికారులు స్పందించి వెంటనే కార్మికుల జీతాల పెంపుదల, ఒకటవ తేదీన జీతాలు వచ్చే విధంగా కాంట్రాక్టు కార్మిక చట్టాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులోనైనా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు.
*డి ఎం ఈ వివరణ*
ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఐ హెచ్ ఎఫ్ ఎం ఎస్) విధానంలో పనిచేయుచున్న కార్మికులకు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం ఐఎఫ్ఎమ్ఎస్ పోర్టర్ లో జత చేసి తక్షణం ఒకటవ తేదీన జీతాలు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అమలు కావలసి ఉన్నప్పటికీ అమలు చేయనందుకు చింతిస్తున్నామని వారు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా నూతన టెండర్లను ఆహ్వానించి కార్మికుల జీతాలు పెంచేందుకు చట్టపరమైనటువంటి హక్కులు అమలు అయ్యే విధంగా కార్మికులకు రావలసిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని వారి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం లక్ష్మీబాయి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ హసీనా బేగం, కార్యదర్శిలు పి సురేష్, ఏ పార్వతి, ఎస్ కిష్టమ్మ, జై లక్ష్మీ, మదన్ సింగ్, షాహిన్ బేగం, కృష్ణవేణి,