Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogపేదోడి సొంతింటి కల సహకారం కాంగ్రెస్

పేదోడి సొంతింటి కల సహకారం కాంగ్రెస్

పేదోని సొంతింటి కల సాకారం చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం

గన్నేరువరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్

గన్నేరువరం , జూలై 12 (నేటి సత్యం): మండలంలోని ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ గన్నేరువరం మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్ స్పష్టం చేశారు. గన్నేరువరం మండల కేంద్రంలో ఆదివారం న్యాత లత-జీవన్ దంపతుల ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొడ్డు సునీల్, లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా బొడ్డు సునీల్ మాట్లాడుతూ.. మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికల సమయంలో నిరుపేదలకు సొంతిల్లు ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారని కొనియాడారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్లను మంజూరు చేయించి, పేదల కలలను నిజం చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక సహకారంతో గన్నేరువరం మండలానికి మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను తీసుకువచ్చి, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గన్నేరువరం గ్రామ సర్పంచ్ లచ్చినర్సు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, నాయకులు మాతంగి అనిల్, విజేందర్, తిరుపతి గౌడ్, పరశురాం, శ్రీకాంత్, రమేష్ మరియు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments