నేటి సత్యం శంషాబాద్ జులై 14
ఏ ఐ టి యు సి నాయకులను శాలువాతో సన్మానించిన వనంపల్లి జైపాల్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో ఏఐటియుసి 5వ మహాసభ తేదీ: 12/07/2026 రోజు పట్టణ కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలో నూతన ఏఐటియుసి మండల కౌన్సిల్ నీ ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు రంగారెడ్డి జిల్లా ఏఐటియుసి కార్యదర్శి మరియు తెలంగాణ మున్సిపల్ స్టాప్ & కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వనపల్లి జైపాల్ రెడ్డి గారు ఎల్.ఐ.టి హోటల్లో నూతనంగా ఎన్నికైన శంషాబాద్ మండల గౌరవ అధ్యక్షులు నర్రాగిరి, అధ్యక్షులు:టి.శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి: గిలక రాజు, ఉపాధ్యక్షులు: దండు రవికుమార్, ఎద్దుల శ్రీను గార్లను మహాసభలో కార్మికులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వనంపల్లి జైపాల్ రెడ్డి వారికి ఘనంగా శాలువాలు కప్పి పూలమాలలు వేసి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ శంషాబాద్ మండలంలో ఏఐటియుసి అన్ని రంగాల్లో విస్తరింపజేసి బలోపేతం చేయాలని కార్మికుల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించాలని తెలియజేయడం జరిగింది.