Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఅసైన్డ్ భూములకు పూర్తి హక్కును కల్పించాలి బాల నరసింహ

అసైన్డ్ భూములకు పూర్తి హక్కును కల్పించాలి బాల నరసింహ

నేటి సత్యం హైదరాబాద్ జూలై 22

అసైన్డ్ భూములకు పూర్తి భూమి హక్కును కల్పించాలి.

సామాజిక న్యాయం కోసం జూలై 27 జరిగే ధర్నాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎం. బాల నరసింహ పిలుపునిచ్చారు.

హైదరాబాద్:తెలంగాణలో పేదలకు, ముఖ్యంగా దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూములకు పూర్తి భూమి హక్కును ప్రభుత్వం వెంటనే కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. బాల నరసింహ డిమాండ్ చేశారు.

దళిత హక్కుల పోరాట సమితి ( డి హెచ్ పి ఎస్) రాష్ట్ర సమితి పిలుపు రాష్ట్రవ్యాప్తంగా జూలై 27న కలెక్టర్ల వద్ద ధర్నా పోస్టర్ ను హిమత్ నగర్ లో రాజ్ బహదూర్ గౌడ్ హాల్లో బుదవారం రోజున విడుదల చేసారు. అనంతరం ఎం. బాల నరసింహ మాట్లాడుతూ దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నప్పటికీ అసైన్డ్ భూములపై రైతులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు లేకపోవడంతో వేలాది కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. భూమి హక్కు లేకపోవడంతో రైతులు బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా పూర్తిగా అందడం లేదని పేర్కొన్నారు.ప్రభుత్వం అసైన్డ్ భూములపై ఉన్న పరిమితులను తొలగించి, సాగు చేస్తున్న లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. భూముల ఆక్రమణలను అరికట్టి, దళితులు మరియు పేదల భూ హక్కులను చట్టబద్ధంగా రక్షించాలని కోరారు.రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో దళిత కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని,రాష్ట్రంలో ఎస్సీ సబ్ ప్లాన్ అమలును బలోపేతం చేసి, ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా పూర్తిగా దళితుల అభివృద్ధి, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు. సబ్ ప్లాన్ చట్టం లక్ష్యాలకు అనుగుణంగా నిధుల ఖర్చుపై ప్రభుత్వం బాధ్యత వహించాలని పేర్కొన్నారు.చిన్న పరిశ్రమలు, స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ లబ్ధిదారులకు ఇండస్ట్రియల్ రుణాల సబ్సిడీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దళిత యువత ఆర్థిక స్వావలంబనకు ఇది ఎంతో అవసరమని తెలిపారు.ఈ డిమాండ్ల సాధన కోసం దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) ఆధ్వర్యంలో జూలై 27న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని ఎం. బాల నరసింహ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కే యేసు రత్నం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి వై ఉషశ్రీ, నాయకులు జేరుపోతుల కుమారస్వామి, కృపాకర్, శోభ, రేణుక తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments