హైడ్రా నుండి భూములను కాపాడేందుకు ఆర్మీని
రంగంలోకి దించాలి
తరచూ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆర్మీ బ్యారక్‌లో ఉంచడానికి కూడా వెనకాడబోము
వివాదాస్పద భూముల్లో హైడ్రా అక్రమ చొరబాటుపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్–మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంటలో సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమిపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి, శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు మధ్య కొనసాగుతున్న వివాదం
రెండుసార్లు ప్రభుత్వం ఓడిపోయినా, మూడోసారి సంస్థ యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, ఈ నెల 17న ఫెన్సింగ్ వేసిన హైడ్రా
ఈ వ్యవహారంలో ఇటీవల న్యాయమూర్తి ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఇదే అంశంపై మరోసారి విచారణ జరిపి, వివాదాస్పద భూముల వద్ద ఆర్మీని రక్షణగా ఉంచాలని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు
రేపటిలోగా 10 మంది ఆర్మీ అధికారుల పేర్లను తెలిపేలా ఆర్మీ బ్రిగేడియర్‌కు విజ్ఞప్తి పంపాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు న్యాయమూర్తి ఆదేశాలు
సదరు భూమిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే రంగనాథ్ అయినా, మరెవరైనా ఆర్మీ సహాయంతో అరెస్ట్ చేయాలని, వారి వాహనాలను కూడా సీజ్ చేయాలని ఆదేశించిన హైకోర్టు
ఆర్మీని ఇలాంటి విషయాల్లో వినియోగించకూడదని తెలిసినా, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేక ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తోందని హైకోర్టు అసహనం
సెక్రటేరియట్లో కూర్చున్న వారికి రాష్ట్రంలో ఏం జరుగుతోందనే దానిపై కూడా అవగాహన ఉండాలని వ్యాఖ్య
వరుసగా మూడుసార్లు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం న్యాయవ్యవస్థను అవమానించడమేనని రంగనాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు