నేటి సత్యం తెలకపల్లి జూలై 24
పురుగుల మందు తాగి యువకుడు మృతి
తెలకపల్లి మండల పరిధిలోని గౌరెడ్డిపల్లి చెందిన అతినారపు. శ్రీకాంత్, వయసు 22 అనే యువకుడు పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్సై ఎం రమేష్ తెలిపారు. గత కొంతకాలంగా మృతుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని తన కుటుంబ సభ్యులతో చెప్పగా వారు నిరాకరించడంతో అదే విషయం మనసులో పెట్టుకొని ఈరోజు మధ్యాహ్నం అందాజా 2 గంటలకు ఇంట్లో నుండి బయలుదేరిన కొద్దిసేపటికి మృతుడు తన సొంత అన్నకి ఫోన్ చేసి నేను పురుగుల మందు తాగినాను అని చెప్పగా వెంటనే అతను కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వెళ్లి చూడగా పర్వతాపూర్ రోడ్ లో ఒక చెట్టు క్రింద చనిపోయి ఉన్నాడు. తన కుమారుడు తన ప్రేమ దక్కలేదని క్షణికావేశంలో తనంతటతానుగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మృతుని తండ్రి అతినారపు బంగారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.