నేటి సత్యం శేరిలింగంపల్లి ఆగస్టు 7
బాధితులు కోర్టుకు వస్తారని నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తారా?
హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు నిలదీత
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని సర్వే నంబర్ 60లో ఉన్న 350 గజాల స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను, వాచ్‌మన్ గదిని హైడ్రా కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పెమ్మసాని సుధారాణి
కూల్చివేతల సమయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, హైడ్రా దాఖలు చేసిన కౌంటర్‌లో కూడా నోటీసు ఇచ్చినట్టు ఎక్కడా లేదని కోర్టుకు తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది
నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం ఏంటి? నోటీసులు ఇస్తే కోర్టుకు వస్తారని, నోటీసులు ఇవ్వకుండా రాత్రికిరాత్రే కూల్చేస్తున్నారా? ప్రజలకు కోర్టుకు వచ్చే అవకాశం కూడా లేదా? అంటూ రెవెన్యూ అధికారులపై, హైడ్రాపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు
అసలు ఆ భూమి ప్రభుత్వ స్థలంలో ఉందని ఎవరు నిర్ధారించారని న్యాయమూర్తి ప్రశ్నించగా, గతంలో తన స్థానంలో ఉన్న ఎమ్మార్వో నిర్ధారించాడని తెలిపిన ప్రస్తుత ఎమ్మార్వో
దీంతో ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన ఎమ్మార్వో పూర్తి రికార్డులతో కోర్టులో హాజరు కావాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు