Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogసి ఆర్ ఫౌండేషన్ లో 80వ స్వాతంత్ర వేడుకలలో డాక్టర్ కే నారాయణ.

సి ఆర్ ఫౌండేషన్ లో 80వ స్వాతంత్ర వేడుకలలో డాక్టర్ కే నారాయణ.

నేటి సత్యం/ హైదరాబాద్/ ఆగస్టు 15

హైదరాబాద్ కొండాపూర్ లోని సి ఆర్ ఫౌండేషన్లో భారత 80 వ స్వాతంత్య్ర దినోత్సవం నేటి ఉదయం ఘనంగా జరిగింది

.

 జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న డాక్టర్ కె నారాయణ

80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చండ్ర రాజేశ్వర రావు ఫౌండేషన్ లో త్రివర్ణ పతాకాన్ని సి ఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కే నారాయణ ఆవిష్కరించారు.

అనంతరం ప్రసంగిస్తూ స్వాతంత్రం ఎన్నో సంవత్సరాల పోరాటం, అనేక త్యాగాల అనంతరం సంపాదించుకున్నాం. మహాత్మా గాంధీ, భగత్ సింగ్ , అల్లూరి సీతారామరాజు లాంటి అనేకమంది ప్రత్యక్ష పాత్ర వహించి పాల్గొన్నారు. అనేక త్యాగాలతో మన స్వాతంత్రం ను సంపాదించుకున్నము.

చండ్ర రాజేశ్వరరావు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు.

80 ఏళ్లు అయిన తర్వాత కూడా ఇప్పుడు ఒక కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఏ త్యాగాలతో అయితే స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామో దాన్ని ఇంకా అమలుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశం చాలా గొప్ప దేశం ప్రపంచంలోనే సంవత్సరానికి మూడు పంటలు పండేటటువంటి దేశం మనది .అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి వనరులను పరిశీలిస్తే గంగా కావేరి నదులు మన దేశంలో ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి.

అదే యూరోప్ దేశాలైతే సంవత్సరానికి ఒకే పంట పండుతుంది మిగతాదంతా మంచు ఉంటుంది కనుక వాళ్లు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది .

మనకు అలాంటి సమస్య లేదు మన భూమి చాలా సారవంతమైన భూమి మన దగ్గర పనిచేసేటటువంటి శ్రామికులు, కార్మికులు, మేధావులు అన్ని రంగాలలో ఆరితేరినటువంటి వాళ్ళు ఉన్నారు. మన భారతదేశ సంపదను చక్కగా ఉపయోగించుకుంటే ఎవరికి ఆకలి దప్పులు ఉండేటటువంటి అవకాశం లేదు అది ఇంకా సాధించవలసిన అవసరం ఉంది ఆ సాధించుకునే క్రమం మనకు ఇప్పుడు కష్టమనిపిస్తుంది . కష్టపడి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము, రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం రాజ్యాంగాన్ని ప్రియాంబుల్ గా తీసుకున్నాం.

యూనిటీని కాపాడే క్రమం లో రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది.

కాన్స్టిట్యూషన్ కి ప్రమాదం వచ్చింది.

ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చింది .

సెక్యులరిజానికి నష్టం వచ్చే ప్రమాదం ఉంది.

ఈ సవాళ్లు ఎదుర్కొని భారత స్వాతంత్ర సంపాదన తోటి ప్రజానీకానికి ఉపయోగపడే పని చేయవలసిన అవసరం ఉందని దానికోసం అంతా కృషి చేస్తారని కోరుకుందామని డాక్టర్ కె నారాయణ ప్రసంగించారు.

సి ఆర్ ఫౌండేషన్ కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వర రావు, సి ఆర్ పాలి క్లినిక్ డైరెక్టర్ శ్రీమతి డాక్టర్ కూనంనేని రజిని, మహిళ సంక్షేమ కేంద్రం డైరెక్టర్ శ్రీమతి జోశ్యభట్ల కల్పన; సభ్యులు వి. లలిత, వృద్ధాశ్రమం సలహామండలి సభ్యులు మల్లంపాటి వెంకటేశ్వర రావు , రాజేంద్ర రావు, తమ్మారెడ్డి తాన్యా కుమారి, ఐదుకల్లు అరుణ, వెలువోలు సాంబశివరావు, మేనేజర్ శ్రీనివాస్, వృద్ధాశ్రమ వాసులు మహిళా సంక్షేమ కేంద్రం వృత్తి విద్య కోర్సుల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

సి ఆర్ ఫౌండేషన్ కోశాధికారి, వృద్ధాశ్రమం డైరెక్టర్ వి. చెన్నకేశవరావు కార్యక్రమాన్ని నిర్వహించారు.

సి ఆర్ పాలి క్లినిక్ డైరెక్టర్ శ్రీమతి డాక్టర్ కూనంనేని రజిని వందన సమర్పణ చేశారు.

ఈ సందర్భంగా మహిళా సంక్షేమ కేంద్రం వృత్తి విద్య కోర్సుల విద్యార్థినులు దేశభక్తి గీతాలు ఆలపించి సభ్యులను అలరింప చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments