నేటి సత్యం / జగిత్యాల/ ఆగస్టు 24
మున్సిపల్ కార్మికులకు వేతనాలు తగ్గిస్తే మరో ఉద్యమం సృష్టిస్తాం
*తెలంగాణ మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి హెచ్చరిక*
తెలంగాణ మున్సిపల్ స్టాప్ & కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ఈరోజు జగిత్యాల మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెన్న మహేష్ ఆధ్వర్యంలో కాలేజీ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మున్సిపల్ స్టాప్ & కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికులని పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పోరాటాలు నిర్వహిస్తుంటే, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ ఎం ఆర్ కార్మికులను కనీస వేతనాలు నెలకు రూ.26 వేలు చెల్లించాలని పోరాటాలు నిర్వహిస్తుంటే, మరొప్రక్క రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్స్, వర్క్ ఇన్స్పెక్టర్స్, డ్రైవర్స్, వాటర్ సప్లయ్, బిల్ కలెక్టర్, శానిటరీ జవాన్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, ఎన్ఎంఆర్ జీతాలు తగ్గించి అమలు చేయాలన్న ఆదేశాలను వెంటనే
ఉపసంహరించుకోవాలని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 2వ పీఆర్సీని అమలు చేయాలి, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిలకు బేసిక్ పేను మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించడం లేదు.
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు రూ.26 వేతనాలు పెంచాలని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు పోరాటాలు నిర్వహిస్తుంటే, రాష్ట్రంలోని కంప్యూటర్ ఆపరేటర్స్, వర్క్ ఇన్స్పెక్టర్స్, డ్రైవర్స్, వాటర్ సప్లయ్, బిల్ కలెక్టర్, శానిటరీ జవాన్, ఇన్స్పెక్టర్స్, ఎన్ఎంఆర్ కార్మికులకు వేతనాలు పెంచకుండా, ఉన్న వేతనాలు తగ్గించటం కార్మిక చట్టాలకు విరుద్ధమని మండిపడ్డారు.
రాష్ట్రంలోని గత ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో అన్ని రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు గత ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తేదీ: 19/02/2016న జీ.వో. ఎం.ఎస్.నెం.14ని మూడు క్యాటగిరిలుగా విభజిస్తూ విడుదల చేయడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం జీ.వో.ఎం.ఎస్. నెం.14ని సవరిస్తూ ఈ యొక్క జీవో లో ఉన్న వేతనానికంటే 30% వేతనాలు పెంచి ఇవ్వాలని తేదీ:11/06/2021 జీ.వో.ఎం.ఎస్. నెం.60ని విడుదల చేయడం జరిగింది.
ఈ యొక్క జీవో ప్రకారంగా అన్స్కిల్డ్ కార్మికులకు. రూ.15,600/-లు, స్కిల్డ్ కార్మికులకు. రూ.19,500/-లు, హైస్కిల్డ్ కార్మికులకు. రూ.22,750/-లు జూన్ నెల నుండి వేతనాలు పెంచి అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
గత ప్రభుత్వం తేదీ: 15/06/2021 నాడు మరొక జీ.వో.ఎం.ఎస్. నెంబర్.63 లో కూడా జీవోఎంఎస్ నెం.14, జీవో ఎంఎస్ నెం.60 ప్రకారం 30 శాతం మించకుండా ఇవ్వాలని అందులో ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క జీవో 60 ప్రకారం మూడు క్యాటగిరి వైజ్ లుగా,మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో అమలు చేస్తున్నారు.
గత ప్రభుత్వం 2022 సంవత్సరంలో మే డే సందర్భంగా ఒక వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది. దాని ప్రకారం రాష్ట్రంలో అన్స్కిల్డ్ కార్మికులకు. రూ.16,600/-(పారిశుద్ధ్య, కామాటి)లు, స్కిల్డ్ కార్మికులకు రూ.20500/-(డ్రైవర్స్)లు,19,500, వర్క్ ఇన్స్పెక్టర్, సానిటరీ జవాన్, హైస్కిల్డ్ కార్మికులకు. రూ.22,750/-లు బిల్ కలెక్టర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ ఎన్ ఎం ఆర్ రూ.22,000/- ల పైన కార్మికులకు అన్ని విభాగాల్లో కార్మికులకు అమలు చేస్తున్నారు. మేడే సందర్భంగా పెంచిన వేతనాలు మాత్రం పారిశుద్ధ విభాగంలో పనిచేసేటువంటి కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. దీని ప్రకారంగానే రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో పనిచేసే డ్రైవర్లకు 20,500 రూపాయలు ఇస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న డ్రైవర్లకు, వర్క్ ఇన్స్పెక్టర్, బిల్ కలెక్టర్, శానిటరీ జవాన్, శానిటరీ ఇన్స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్స్ వేతనాలు తగ్గిస్తున్నామని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తేదీ: 12/07/2026 రోజు జి.ఓ.ఆర్టి.నెం.1181 విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో కార్మికులకు అమలు చేస్తున్నటువంటి వేతనంలో తగ్గించి ఇవ్వాలని ఏ కార్మిక చట్టంలో లేదు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి ఇవ్వాలని జీ.వోని విడుదల చేయడం విడ్డూరంగా ఉంది. జీ.వో.ఆర్టీ.నెం.1181ని ఉపసంహరించుకొని రాష్ట్రంలోని కంప్యూటర్ ఆపరేటర్స్, వర్క్ ఇన్స్పెక్టర్స్, డ్రైవర్,ఎంఎంఆర్, బిల్ కలెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్, కార్మికులకు యధావిధిగా పాత పద్ధతిగానే వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
రాష్ట్రంలోని ఎంఎంఆర్ కార్మికులను కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్లో కలుపుతున్నామని కార్మికులకు రూ.16600లు ఇస్తామని అధికారులు చెప్పటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వారికి యధావిధిగా వేతనాలను అమలు చెయ్యాలన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రులకు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లక్షలలో జీతాలు తీసుకుంటున్నారు మీరు ఏ పనిచేసే ఉద్దరిస్తున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలను అమలు చేయకూడదని ఆదేశాలు ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మికులు కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, విడో పెన్షన్, వృద్దాప్య పెన్షన్ లాంటి పథకాలను వర్తింప చెయ్యాలి.
మున్సిపల్ కార్మికులు విధి నిర్వాహణలో, అనారోగ్యంతో మరణించినా మరియు 60 సంవత్సరాలు నిండిన పైబడిన కార్మికుల కుటుంబంలో ఒకరికి మానవతా దృక్పథంతో ఉద్యోగం ఇవ్వాలి.
మరణించిన కార్మికునికి దహన సంస్కారాల ఖర్చులు రూ.30వేలు, కార్మికులకు మున్సిపల్ అధికారులే బీమా సౌకర్యం కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.25లక్షలు అన్ని సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో కార్మిక వర్గాన్ని ఐక్యమత్యం చేసి సంఘటితం పరిచి సమ్మె చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఎండి ఉస్మాన్, జిల్లా మున్సిపల్ సంఘం అధ్యక్షులు మేసు సతీష్, ప్రధాన కార్యదర్శి బాలే అజయ్ కుమార్, బి సత్తయ్య, సిహెచ్ మీనయ్య, సుద్దాల రాజేందర్, కే రాజేష్, కొండ్ర రమేష్, కే వాణి, అనంత, సుగుణ, పద్మ, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.