నేటి సత్యం /
నగర్ కర్నూల్ /ఆగస్టు 30
బడ్లవు జరూరి హై *మార్పు కావాలి అంటూ చలో ఢిల్లీ కార్యక్రమానికి చారాలి వెళ్లిన నేతలు సిపిఐ నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ వెల్లడి
దేశంలో అమలవుతున్న ప్రజాస్వామిక విధానాలను ప్రతిఘటిస్తూ ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణ కోసం సిపిఐ ఇచ్చిన పిలుపురి మార్పు కావాలి అని దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించిన సిపిఐ సెప్టెంబర్ 1వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది పిలుపులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా నుండి వందలాదిమంది పార్టీ నాయకులు కార్యకర్తలు చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి వెళ్తున్నారని సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి తెలియజేశారు హైదరాబాద్ లోని నాంపల్లి స్టేషన్ నుండి తెలంగాణ ఎక్స్ప్రెస్ మరియు ఇతర మార్గాల ద్వారా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఢిల్లీ నగరానికి తరలి వెళ్తున్నాయని ఆయన తెలియజేశారు 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజాస్వామిక విధానాలు దేశ ఆర్థిక విధానాలు దేశాన్ని దేశ ఆర్థిక స్థితిని ఓ అరా శతాబ్దం వెనక్కి నెట్టేసాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో విద్వేషాలే తప్ప మోడీ 12 సంవత్సరాల పరిపాలల్లో సాధించింది ఏమీ లేదని ఈ సందర్భంగా వారు వివరించారు మోడీని పాలన చాలు జరూరి మార్పు కావాలి అంటూ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో లక్షలాది మందితో సిపిఐ భారీ నిరసన సభ నిర్వహించబోతుందని వారు తెలియజేశారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా తోపాటు జాతీయ కార్యదర్శివర్గ సభ్యులందరూ ఈ సభలో పాల్గొని దేశ పరిస్థితులను ప్రజలకు వివరిస్తారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు బండి లక్ష్మీపతి బిజా శ్రీనివాసులు తుమ్మల శివుడు వి రవీందర్ ఈ మల్లయ్య టి కిరణ్ కుమార్ డి అంజనేయులు జె రమేష్ కే వెంకటమ్మ ప్రేమ్ కుమార్ తదితరులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు