Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఫైనాన్స్ వేధింపులకు యువకుడు బలి

ఫైనాన్స్ వేధింపులకు యువకుడు బలి

ఫైనాన్స్ వేధింపులతో యువకుడు బలి

కామారెడ్డి ఆగస్టు 30 నేటి సత్యం ప్రతినిధి కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బస్వాయి పల్లి గ్రామంలో దారుణం జరిగింది. శుక్రవారం సాయంత్రం ఫైనాన్స్ వేధింపుల వల్ల యువకుడు బలి అయ్యాడు.పిట్లం విఠల్ అనే యువకుడు నూతనంగా ఇల్లు నిర్మించు కోవడంతో అప్పుల పాలయ్యాడు.ఇంటి పైన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో రుణం తీసుకున్నాడు.కూలి పని చేస్తూ ఫైనాన్స్ డబ్బులు కడుతుండగా కొన్ని ఈఎంఐ లు సకాలంలో చెల్లించలేకపోయాడు .ఈఎంఐ లు చెల్లించలేక భార్య అనురాధ తన ఇద్దరు కుమార్తెలు పావని,మైథిలి లను తీసుకుని హైదరాబాద్ కు వలస వెళ్ళి నూతన భవనంలో వాచ్మెన్ గా పని చేస్తున్నారు.ఫైనాన్స్ సిబ్బంది ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు.అది తెలుసుకున్న పిట్లం విఠల్ తన స్వగ్రామానికి చేరుకుని మనస్థాపంతో తాళం వేసిన తలుపులు తెరిచి అదే ఇట్లు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు తన భర్త ఫైనాన్స్ వేధింపుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆరోపిస్తుంది నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్ లో సదరు ఫైనాన్స్ కంపెనీల పై ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు స్థానికులు కోరుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments