నేటి సత్యం /హైదరాబాద్/ ఆగస్టు 30
మున్సిపల్ కార్మికునికి విధులు నిర్వహిస్తున్న సమయంలో యాక్సిడెంట్ పట్టించుకోని అధికారులు
తెలంగాణ మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి
తెలంగాణ మున్సిపల్ స్టాప్ & కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి ఈరోజు శివరాంపల్లి లో నివాసముంటున్న పారిశుధ్య కార్మికుడు ఎస్ రామచంద్రయ్య గారిని పరమాశించడం జరిగింది. ఈ సందర్భంగా వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ అత్తాపూర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి డివిజన్ గగన్ పాడ్ ప్రాంతంలో రోజు మాదిరిగా తేదీ:28/08/206 శుక్రవారం ఉదయం 7 గంటలకు పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న ఎస్.రామచంద్రయ్య, వయసు 55 సంవత్సరాలు గగన్ పాడ్, శాతంరాయి మధ్య సర్వీస్ రోడ్డులో చెత్త కుప్పలు ఎత్తుతున్న సమయంలో బైక్ యాక్సిడెంట్ కావడంతో కార్మికునికి రెండు మోకాళ్ళకు నడుములకు బలమైన గాయాలు తగలడం జరిగింది. అధికారులు పారిశుద్ధ్య కార్మికులచే విధులు పర్యవేక్షణ చేస్తున్నటువంటి *మైలార్ దేవ్ పల్లి ప్రాంతంలో శానిటేషన్ సూపర్వైజర్ (SS)* కు కార్మికులని పనిచేయాలని ఒత్తిడి చేయడమే తప్ప కార్మికులకు ప్రమాదాలు జరిగిన నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాడు. వీళ్లకు కార్మికులు ప్రమాదాలకు గురైన సరే ప్రతిరోజు విధులు నిర్వహించాలని కార్మికులపై ప్రతిరోజు ఒత్తిడి చేయడమే తప్ప కార్మికుల ఆరోగ్యాలు ఏ విధంగా ఉన్నాయని ఏ ఒక్కరిని కూడా పలకరించరు. అధికారులు ఇప్పటికైనా ప్రమాదాలు జరిగిన సమయంలో స్పందించి కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. మూడు రోజులైనా కార్మికునికి రెండు మోకాళ్ళకు ప్రమాదం జరిగిన ఏ ఒక్క అధికారి కూడా పలకరించిన పాపాన పోలేదు ఇప్పటికైనా కార్మికుడు అంటే నిర్లక్ష్య ధోరణి వదలాలని హెచ్చరిస్తున్నాము.