Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogశిథిలావస్థలో వాటర్ ట్యాంకర్..

శిథిలావస్థలో వాటర్ ట్యాంకర్..

నేటి సత్యం వార్తకు స్పందన
జీ పి లో తీర్మానం చేశాం
రహదారి మరమ్మత్తు పనులు త్వరలో ప్రారంభిస్తాం
సర్పంచ్ బునేకర్ జ్యోతి ప్రకాష్
కామారెడ్డి సెప్టెంబర్ 03 నేటి సత్యం ప్రతినిధి
బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో సుమారు సంవత్సరం పాటుగా రహదారి మరమ్మత్తు పనులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకొని రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన నేటి సత్యం పత్రికలో కథనం రావడంతో స్పందించిన సర్పంచ్ బునేకర్ జ్యోతి ప్రకాష్ అనేక సందర్భాలలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఎట్టకేలకు నెల రోజుల క్రితం గ్రామపంచాయతీలో సభ్యుల సమక్షంలో రహదారి నిర్మాణ పనులను చేపట్టడం కోసం తీర్మానం చేసినట్లు ఆమె నేటి సత్యం ప్రతినిధికి తెలిపారు త్వరలో పనులు కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఇదిలా ఉండగా వాటర్ ట్యాంక్ విషయంలో మాత్రం సంబంధిత అధికారుల దృష్టికి మాత్రం తీసుకొని వెళ్ళినట్లు ట్యాంకు శిథిలావస్థకు చేరుకోవడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్న విషయం వాస్తవమే అని దీని పై మరొకసారి అధికారులు దృష్టికి తీసుకుని వెళ్తానని ఆమె అన్నారు ప్రస్తుతం ట్యాంక్ నిరుపయోగంగా ఉందని దాన్ని తొలగించినట్లయితే అదే స్థలంలో నూతనంగా ట్యాంక్ నిర్మించినట్లయితే చుట్టుపక్కల ప్రజలకు నీటి సమస్య లేకుండా చూడవచ్చని ఆమె పేర్కొన్నారు
గ్రామ సమస్యలను అధికారుల పాలకుల దృష్టికి తీసుకుని వెళ్ళినందుకు ఆమె నేటి సత్యం పత్రిక ను అభినందించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments