Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు

నేటి సత్యం/ శేరిలింగంపల్లి /అక్టోబర్ 30

-గుట్ట‌ల‌బేగంపేట‌లో..

-ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా

-రెవెన్యూ అధికారుల విన‌తి మేర‌కు హైడ్రా చ‌ర్య‌లు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం, గుట్ట‌ల‌బేగంపేట విలేజ్ స‌ర్వే నంబ‌రు 63లో ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఈ స‌ర్వే నంబ‌రులో మొత్తం 78 ఎక‌రాలుండ‌గా.. ఇందులో కొంత భూమి ఇప్ప‌టికే క‌బ్జాలై.. నివాసాలు వ‌చ్చాయి. ఈ భూమి త‌మ పూర్వీకుల‌ద‌ని కొంత‌మంది అమ్ముకుంటూ వ‌స్తున్నారు. అలాగే మ‌రి కొంత‌మంది ప్ర‌హ‌రీలు నిర్మించుకుని భూమిని కాపాడుతున్నారు. ఈ వివాదం హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టేట‌స్ కో ఉత్త‌ర్వుల‌ను ప‌ట్టించుకోకుండా.. అక్క‌డ ప్లాట్ల అమ్మ‌కాలు కొత్త‌గా నిర్మాణాలు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రెవెన్యూ అధికారులు హైడ్రాను ఆశ్ర‌యించారు. కోర్టు ఉత్త‌ర్వుల ప్ర‌కారం అక్క‌డ య‌థాస్థితి కొన‌సాగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైడ్రాను రెవెన్యూ కోరింది. ఈ మేర‌కు శుక్ర‌వారం గుట్ట‌ల బేగంపేట‌లోని స‌ర్వే నంబ‌రు 63లో హైడ్రా ఫెన్సింగ్ వేసింది. 500ల మీట‌ర్ల‌కు పైగా ఫెన్సింగ్ వేసి ఆక్ర‌మ‌ణ‌ల‌కు ఆస్కారం లేకుండా చ‌ర్య‌లు తీసుకుంది. రెవెన్యూ అధికారుల స‌మ‌క్షంలో హైడ్రా ఈ చ‌ర్య‌లు తీసుకుంది.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments