రోటరీ క్లబ్ సహకారంతో భూ పోరాట కేంద్రంలో వెలుగులు
నేటి సత్యం జనవరి 28
రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ మావెరిక్స్ వారి సహకారంతో అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని కుంట్లూరు రావి నారాయణ రెడ్డి ఫెజ్ 3 భూ పోరాట కేంద్రంలో వెలుగులు విరజిమ్ముతున్నావి.
హైదరాబాద్ కి కూతవేటు దూరంలో గత నాలుగేళ్లుగా దాదాపు 8 వేల కుటుంబాలు చిమ్మ చీకట్లో జీవనం సాగిస్తున్నారు.అనేక మంది పిల్లలు ఆ చీకట్లోనే తమ చదువులను సైతం కొనసాగిస్తున్నారు.విషయం తెలుసుకొని రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ మేవరిక్స్ వారు దాతల సహకారంతో భూ పోరాట కేంద్రంలో ఏర్పాటు చేయటానికి 152 సోలార్ లైట్లని అందించారు.భూ పోరాట కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆ లైట్లని మరియు భూ పోరాట కేంద్రాన్ని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డా. రాంప్రసాద్ , కార్పొరేట్ సామాజిక బాధ్యత విరాళ దాత శ్రీ రవి ప్రసాద్ , మేనేజింగ్ డైరెక్టర్ ఆటోమోటివ్ రోబోటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మావెరిక్స్ సంస్థ అధ్యక్షులు సురేష్ బాబు,కార్యదర్శి మాధవి,మాజీ అధ్యక్షులు వనశ్రీ,సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ అజయ్ కుమార్ మరియు రష్మీ, హోషంగ్ పటేల్ టెక్ సెంటర్ సభ్యులు డా. పి. సుబ్బారావు, డా. శ్రీనివాస్ రావు గార్ల బృందం బుధవారం నాడు పరిశీలించారు.కొన్ని వేల మంది నిరుపేద ప్రజలు కనీస సదుపాయాలు లేకుండా ఇన్నేళ్లుగా కారు చీకట్లో జీవనం గడపటం మరియు అనేక మంది పాఠశాల విద్య నుండి మొదలు ఉన్నత స్థాయి విద్యను అభ్యసించే వాళ్ళు ఈ గుడిసెల్లో నివసించటం చూసి ఆశ్చర్యపోయారు.తమ సంస్థ నుండి అందించిన సోలార్ లైట్ల వెలుతురులో స్కూల్ పిల్లలు చదువుకోవటం మరియు ఆడుకోవటం చూసి వాళ్ళు సంతోష పడ్డారు.ఇలాంటి పేద ప్రజల కోసం భవిష్యత్తులో కూడా అనేక సహాయ సహకారాలు అందించటానికి తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.ఈ సందర్బంగా కాలనీ కమిటీ అధ్యక్షులు అందోజు రవీంద్ర చారీ మరియు సభ్యులు ముత్యాల యాదిరెడ్డి గార్లు మాట్లాడుతూ మానవతా దృక్పతంతో నీరుపేద ప్రజల పట్ల ప్రేమతో భూ పోరాట కేంద్రం గుడిసెల్లో వెలుగులు నింపిన రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ మావెరిక్స్ వారికి , విరాళ దాతలకు శాలువాలు కప్పి సన్మానించి పేద ప్రజలందరి తరుపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీరా హరిసింగ్ నాయక్,సహాయ కార్యదర్శి కేతరాజు నర్సింహా,నాయకులు ప్రసాద్,అరుణ,నవనీత,సైదులు ముదిరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.