Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకార్పొరేట్ దోపిడీకి చెక్ పెట్టాలి మే డే స్ఫూర్తితో ఉద్యమించాలి..

కార్పొరేట్ దోపిడీకి చెక్ పెట్టాలి మే డే స్ఫూర్తితో ఉద్యమించాలి..

నేటి సత్యం శేర్లింగంపల్లి ఏప్రిల్ 30 “*కార్మికుల రక్తంతో నిర్మించిన *హక్కులను* కాపాడుకోవాలి దేశంలో కార్పొరేట్ దోపిడీకి చెక్ పెట్టాలి!” టి రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు.

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా దేశంలోని సమస్త కార్మిక లోకానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) హృదయపూర్వక విప్లవ శుభాకాంక్షలు తెలుపుతుంది.

శతాబ్దాలుగా కార్మిక వర్గం చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే 8 గంటల పనిదినం, కనీస వేతనాలు, కార్మిక హక్కులు సాధ్యమయ్యాయి. కానీ నేటి పాలకులు, కార్పొరేట్ శక్తులు ఈ హక్కులను ఒక్కొక్కటిగా దెబ్బతీస్తూ కార్మికులను మళ్లీ బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ, ప్రైవేటీకరణ, కాంట్రాక్టు విధానాల ద్వారా ఉద్యోగ భద్రతను నాశనం చేస్తున్నాయి. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, కనీస వేతనాల లోపం వల్ల కార్మికుల జీవితం దయనీయంగా మారింది.

– అన్ని కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత హామీ ఇవ్వాలి

– కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి, శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి

– పెరుగుతున్న ధరలను నియంత్రించి ప్రజలపై భారం తగ్గించాలి

– కార్మిక చట్టాలను బలహీనపరిచే విధానాలను తక్షణమే ఉపసంహరించాలి

మేడే స్పూర్తి అంటే కేవలం జెండాలు ఊపడం కాదు – దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటం, కార్మిక హక్కులను కాపాడటం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మికులు ఏకమై, పోరాట పంథాను మరింత బలపరచాలి.

“ప్రపంచ కార్మికులారా ఏకం కండి – మీ గొలుసులు తప్ప మీకు కోల్పోయేదేమీ లేదు!”

ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం ఐక్యతతో ముందుకు సాగి, దోపిడీ పాలనకు చెక్ పెట్టాలని సిపిఐ పిలుపునిస్తోంది.

జయహో కార్మిక వర్గం!

జయహో మేడే స్పూర్తి!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments