Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogగతంలో ఈదులకుంట చెరువుగా తేల్చిన. హైడ్రా మరి ఇప్పుడు.?

గతంలో ఈదులకుంట చెరువుగా తేల్చిన. హైడ్రా మరి ఇప్పుడు.?

కూకట్ పల్లి సర్వే నెంబరు తో కానమెట్టు చెరువును లేకుండా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి

సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు.

కబ్జాదారులపై చర్యలు తీసుకునే వరకు సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం అధికారుల నిర్లక్ష్యంపై టి రామకృష్ణ మండిపాటు

నేటి సత్యం శేరిలింగంపల్లి ఏప్రిల్ 30

శేర్లింగంపల్లి మండల పరిధిలోని కానామెట్టు చెరువును కొంతమంది బిల్డర్లు కబ్జా చేసి దానికి కూకట్పల్లి సర్వే నెంబరు జత చేసి చెరువులు కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు టి రామకృష్ణ డిమాండ్ చేశారు

శేర్లింగంపల్లి లోని.భూములకు కోట్లు విలువ ఉండడంతో అక్రమ కబ్జాదారులు ఇట్టి భూములపై కన్ను వేసి లేని సర్వే నెంబర్లను సృష్టించి చెరువులను నాలాలను కుంటలను కనుమరుగు చేసి వేలకోట్ల రూపాయలను అర్జిస్తున్న ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న ప్రభుత్వ అధికారులు నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరించడం ఏమిటని వారు నిలదీశారు

ఖమ్మం జిల్లా వెలగమట్లలో మన హైదరాబాదులో పేదలు నిర్మాణం చేసుకున్న పూరి గుడిసెలను రాత్రికి రాత్రే కూల్చేసిన హైడ్రా అధికారులు ధనవంతులు నిర్మాణం చేస్తే ఇండ్లు కనబడడం లేదా అని వారు ప్రశ్నించారు

హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే అక్రమ కబ్జాదారులపై కొరడా జూలిపించి తక్షణమే కూల్చివేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని లేకపోతే వారితో హైడ్రా కుమ్మక్ అయిందని ప్రజలు నమ్మే అవకాశాలు ఉన్నాయని చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి అయినా హైడ్రాధికారులు ఈ అక్రమ కబ్జాదారులపై కేసులు పెట్టి అరెస్టులు చేయాలని వారు డిమాండ్ చేశారు

ఈ అక్రమ కద్యాదారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అలాగే హైడ్రాధికారులను కలిసి అప్పటికి చర్యలు తీసుకోకపోతే లీగల్గా కోర్టుకు సైతం వెళ్లే అవకాశం ఉందని వారు తెలిపారు

నిరసన కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె చందు యాదవ్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు కే వెంకటస్వామి పార్టీ నాయకులు తుపాకుల రాములు కాసిం వెంకటేష్ జెట్టి శ్రీను తిరుపతయ్య కిరణ్ బాలస్వామి అజయ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments