Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఈధులకుంట చెరువును కబ్జా నుండి కాపాడండి

ఈధులకుంట చెరువును కబ్జా నుండి కాపాడండి

నేటి సత్యం శేర్లింగంపల్లి మే 6

*కానామెట్టు ఈదులకుంట చెరువును కబ్జా నుంచి రక్షించాలి ఆర్డీవో గారికి వినతి సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పానుగంటి పర్వతాలు*

ఆర్డీవో రాజేంద్రనగర్ గారికి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది తక్షణమే ప్రభుత్వ భూములను రక్షించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని అన్నారు కానమెట్టు ఈదులకుంట చెరువు ఆరు ఎకరాల ఐదు కుంటలు. చెరువును సెల్లార్ కొట్టి రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టబోతున్న ఎస్విఎన్ కన్స్ట్రక్షన్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు

కానామెట్టు గ్రామ పరిధిలోని ఈదులకుంట చెరువు పై కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసి, సెల్లార్ తవ్వకాల వంటి నిర్మాణాలు చేపట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చెరువు వంటి ప్రజా ఆస్తిని నాశనం చేయడం వల్ల గ్రామ ప్రజల జీవనాధారంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.

ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. చెరువు పై జరుగుతున్న అక్రమ కబ్జాలను వెంటనే నిలిపివేయాలని, ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని అధికారులను కోరారు. చెరువు పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకుని ప్రజా ఆస్తిని రక్షించాలని డిమాండ్ చేశారు.

చెరువులు గ్రామాల జీవనాడులు. అవి నాశనం అయితే రైతులకు సాగునీరు అందక పంటలు దెబ్బతింటాయి, భూగర్భ జలాలు తగ్గిపోతాయి. కాబట్టి చెరువుల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని సిపిఐ నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ఈ రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే చందు యాదవ్ సిపిఐ శేర్లింగంపల్లి మండల కార్యదర్శి తుప్పాకుల రాములు ఏ ఐటియుసి మండల అధ్యక్షులు జెట్టి శ్రీనివాస్ మండల సహకార దర్శి కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రజా ఆస్తులను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత – చెరువు కబ్జాలను వెంటనే తొలగించాలి!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments