Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogరైతు పండించిన పంటను కొనుగోలు చేయండి టి రామకృష్ణ

రైతు పండించిన పంటను కొనుగోలు చేయండి టి రామకృష్ణ

*రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం*టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు*

రైతు పండించిన ప్రతి గింజలో అతని చెమట, కష్టం, కుటుంబ ఆశలు దాగి ఉంటాయి. కానీ రైతులు కష్టపడి పండించిన ధాన్యం, వడ్లు. మకలు మిర్చి, పత్తి తదితర పంటలను కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. కొనుగోలు కేంద్రాలు సక్రమంగా ప్రారంభించకపోవడం, మద్దతు ధర ప్రకటించినా అమలు చేయకపోవడం, తూకాల్లో మోసాలు, చెల్లింపుల్లో జాప్యం వంటి కారణాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అని టి రామకృష్ణ అన్నారు

పంటను అమ్ముకోలేక రైతులు రోడ్లపై, మార్కెట్ యార్డుల్లో రోజులు గడుపుతున్నారు. ఒకవైపు అప్పులు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు రైతులను నష్టాల్లోకి నెట్టేస్తుంటే ప్రభుత్వాలు మాత్రం కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధానాలతో రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా పాలకుల్లో చలనం కనిపించడం లేదు.

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే అన్ని పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, దళారుల దోపిడీ అరికట్టి రైతులకు తక్షణ చెల్లింపులు చేయాలి.

రైతు బతికితేనే దేశం బతుకుతుంది. రైతాంగాన్ని కాపాడని ప్రభుత్వాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. రైతు వ్యతిరేక విధానాలను సిపిఐ ఎట్టి పరిస్థితుల్లో సహించదు. రైతుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments