Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogయువ రాజకీయానికి నవ మార్గదర్శి రాజీవ్ గాంధీ

యువ రాజకీయానికి నవ మార్గదర్శి రాజీవ్ గాంధీ

నేటి సత్యం శేర్లింగంపల్లి మే 21

యువ రాజకీయానికి నవ మార్గదర్శి స్వర్గీయ  రాజీవ్ గాంధీ  అని అన్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ .

భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన దృవతార,ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి,నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు,మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ  వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు,ప్రజలతో కలిసి మదీనాగూడ డివిజన్ పరిధిలోని హుడా కేఫ్ నందు నాయకులు రవి కుమార్ నాయీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహానేతకు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ:

“ఓటు వేసే వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించడం,పంచాయతీ రాజ్‌ను బలోపేతం చేయడం,టెలికాం మరియు ఐటీ విప్లవం,కంప్యూటరైజేషన్ కార్యక్రమాలు,శాంతి ఒప్పందాల కొనసాగింపు,మహిళా సాధికారత,సార్వత్రిక రోగనిరోధక కార్యక్రమం మరియు సమ్మిళిత విద్యపై ప్రాధాన్యతతో కొత్త విద్యా విధానం వంటి ఆయన అనేక ముఖ్యమైన కార్యక్రమాలు దేశంలో పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చాయని,భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

అంతేకాక తన తల్లి మరియు అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారి హత్య తర్వాత 1984లో రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు..

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోర్డినేటర్ రఘునందన్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు అలీ,బాష్పాక యాదగిరి,నగేష్ నాయక్,నాయకులు నాగేశ్వర్ రావు,శేఖర్ ముదిరాజ్,రవీందర్ రెడ్డి,కావూరి ప్రసాద్,మన్నేపల్లి సాంబశివ రావు,ప్రభాకర్ రెడ్డి,కనకమామిడి నరేందర్ గౌడ్,రాములు గౌడ్,నర్సింహ గౌడ్,యలమంచి ఉదయ్ కిరణ్,మిరియాల ప్రీతం,రాజేష్,శివ కుమార్,విష్ణు,పద్మ రావు,సౌందర్య రాజన్,నర్సింగ్ రావు,వెంకట్ రెడ్డి,సాదిక్,జావేద్,రామచందర్ గౌడ్,నరేందర్ ముదిరాజ్,గోపాల్ నాయక్,శంకర్ గౌడ్,చిన్న,కార్తీక్ గౌడ్,రిజ్వాన్,అలీ మహిళా కాంగ్రెస్ నాయకులు అనిత,జయ,శాంత తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments