నేటి సత్యం శంషాబాద్ మే 22
ముఖ్య మంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదు పెరిగిన ధరలకు అణుగుణంగా కనీస వేతనాలు పెంచాలి*
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి పర్వతాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారు ఈ రోజు సచివాలయంలో ప్రెస్మీట్ పెట్టి కార్మిక శాఖ పరిధిలోని షెడ్యుల్డ్ ఎంప్లాయిమెంట్ కనీస వేతనాల పెంపుదలను ప్రకటించారు. సుమారు 14 సం॥ల తరువాత రాష్ట్రంలో కనీస వేతనాలు సవరించడం ఆహ్వానించదగ్గ పరిణామం. 26 జూన్ 2 నుండి సవరించిన వేతనాలు అమలు చేస్తామని ప్రకటించారు. కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కల్గుతుందని చెప్పారు. ప్రకటించిన వేతనాలు పెరిగిన ధరలకు, అణుగుణంగా కార్మికులు, కార్మిక సంఘాల చేసిన డిమాండ్ను పట్టించుకోకపోవడం తీవ్ర అసంతృప్తిని కల్గిస్తుంది. ముఖ్యమంత్రి గారు వేతనాల పెంపుదల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని, దేశానికే ఆదర్శవంతంగా ఉండేలా శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనాల పెంపుదల చేస్తామని ప్రకటించారు. ఆచరణలో చూస్తే ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపుదలలో శాస్త్రీయత లోపించింది. ఆశాస్త్రీయమైన పద్ధతిలో వేతానాలను ప్రకటించారు. పెరిగి ధరలకు కనీస వేతనాలు పెంచాలని ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
కనీస వేతనాలను రాష్ట్రంలో 3 జోన్స్లుగా విభజించారు. మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాల్టీలు, గ్రామీణ ప్రాంతాలుగా విభజించి వేతనాలు వేరువేరుగా ప్రకటించడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే వేతనాలను 4 క్యాటగిరీలు విభజించి అన్ని రంగాలలో ఒకేరితిలో వేతనాలు పెంచడం వల్ల గతంలో ఎంప్లాయిమెంట్స్లో వివిధ రకాల పనులకు వివిధ రకాలుగా ఉన్న పద్ధతి లేకుండాపోతుంది. దీని వల్ల నష్టం జరుగుతుంది. కనీస వేతనాల పెంపుదల సందర్భంగా కరువుభత్యం గురించి ప్రస్తావించక పోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అని ఆయన అన్నారు
పెరిగిన వేతనాలు కూడా 4 క్యాటగిరీలో అన్స్కిల్ద్ వర్కుర్కు రూ.16,000/-, సెమిస్కిల్డ్ వర్కర్కు రూ.17,000/-, స్కిల్డ్ వర్కర్కు రూ.18,500/-, హైస్కిల్డ్ వర్క్ర్కు రూ.20,000/-లు పెంచినట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో ఒక్క అన్స్కల్డ్ వర్క్్కర్కు తప్ప మిగితా వారికి బేసిక్ కరువుభత్యం కలుపుకొని ఇప్పటికే వస్తున్న జీతానికి పెరిగిన దానికి పెద్ద తేడా లేదు. అవి కూడా జూన్1 కార్పొరేషన్లను ప్రకటించినట్లుగా చెబుతున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఇంకా తగ్గే పరిస్థితి ఉందని అన్నారు
కాంట్రాక్టు లేబర్ జీవోనెం 11 ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో రూ.13,098 నుండి 23683 వరకు వేతనాలు పొందుతున్నారు. మరి ప్రభుత్వం పెంచింది పెద్దగా ఏమి లేదు. ప్రస్తుతం అమలులో ఉన్న జీవో నెం 4 తో పోలిస్తే కూడా కొన్ని క్యాటగిరీలలో స్వల్ప పెరుగుదలగాను, కొన్ని క్యాటగిరీలో ప్రస్తుతం పొందుతున్న వేతనం కంటే తగ్గింది. జీవో నెం 4లో స్కిల్డ్ కార్మికుడికి వేతనం రూ.19,572/-లు వుండగా ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వేతనం రూ. 18,500/-లు మాత్రమే. గతంతో పోలిస్తే రూ. 1072/- లు తగ్గింది. దీంతో పాటు బిఆర్ఎస్ ఆధికారంలో వుండగా కనీస వేతనాల సలహామండలి బోర్డు అన్స్కిల్డ్ కార్మికుడికి కనీస వేతనం రూ.18,009/-లు, కరువుభత్యాన్ని ఒకొక్క ఫాయింటికి రూ.12/-లు సిపార్సులు చేశారు. దీంతో పాటు 2021 జూన్ 25న అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం 5 జీవోలను జారీ చేసింది. వాటికి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేయలేదు. ఇప్పటి వరకు అనుసరించాల్సిన ఏ ప్రామాణీకాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. కార్మిక సంఘాలు, కనీస వేతనాల సలహామండలి సిపార్సులను పరిగణలోకి తీసుకోకుండా మంత్రివర్గ ఉపసంఘం పేరిట కనీస వేతనాలు ప్రకటించారు. ప్రభుత్వం కనీస వేతనం రూ. 26,000/-లుగా నిర్ణయించాలని పర్వతాలు డిమాండ్
పెరిగిన ధరలు, 1948 కనీస వేతనాల చట్టం, డాక్టర్ అక్రాడ్ ఫార్ములా, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా వేతనాలు పెంచలేదు. శాస్త్రీయంగా లెక్కిస్తే రూ.32,000/-లు వస్తుంది. అయినప్పటికినీ కార్మిక సంఘాలు కనీస వేతనం రూ.26 వేలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. కార్మిక సంఘాల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నాం.