Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఅపాయింట్మెంట్ కావాలంటే ఫోన్ చేయాలి..

అపాయింట్మెంట్ కావాలంటే ఫోన్ చేయాలి..

నేటి సత్యం హైదరాబాద్ జూన్ 1

అపాయింట్‌మెంట్ కావాలంటే ఫోన్ చేయాలి రేవంత్ రెడ్డి గారూ!

ముఖ్యమంత్రి అయ్యాక 30 నెలలు గడిచాక తీరిగ్గా మేల్కొన్న అభినవ కుంభకర్ణ రేవంత్ రెడ్డి తమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తుపెంపు చర్చల కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వడం లేదని. అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాశానని నిన్న సిగ్గువిడిచి మీడియా ముందు చెప్పుకొచ్చాడు.

ఈయనగారి అసమర్థతకు, తెలివితక్కువతనానికి, రాజకీయ అపరిపక్వతకు ఇదే నిదర్శనం.

2014 జూన్ రెండు నాడు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గోదావరి జలాల వినియోగం అంశంలో రెండు నెలల్లోనే అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించారు. కొత్త రాష్ట్రంలో విభజన సమస్యలు ఎన్నో ఉన్నా, అధికారుల కొరత ఉన్నా, కేసీఆర్ నీటి ప్రాజెక్టులకే ప్రధమ ప్రాధాన్యత ఇచ్చారు.

ముఖ్యమంత్రి అయిన 8 నెలల్లోనే స్వయంగా మహారాష్ట్ర వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో గోదావరి జలాలపై చర్చలు జరిపారు. 2016 నాటికి చిక్కుముడులు అన్నీ విప్పి చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని మేడిగడ్డ, తుమ్మిడిహట్టి, చనాక-కొరాట, లెండి ప్రాజెక్టుల గురించి ఒప్పందం కుదుర్చుకుని పని ప్రారంభించారు.

2004-2014 వరకు ఉన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఇవ్వాళ ఉన్న రేవంత్ ప్రభుత్వం అయినా తుమ్మిడిహట్టి వద్ద 148 అడుగులకు మించి బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం అసాధ్యం అని కేసీఆర్ గారు కొన్ని వందల సార్లు చెప్పారు.

కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రతిపక్షంలో ఉండగా ప్రజలను మోసపుచ్చి తుమ్మిడిహట్టి ఎత్తుపెంచి కడతామని అబద్ధాలు ఆడాడు.

ఇప్పుడు అధికారంలోకి వచ్చి 30 నెలలు గడచినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ తుమ్మిడిహట్టి విషయంలో ఒక్క అడుగు ముందుకువేయలేదు.

ఉల్టా సిగ్గులేకుండా దేవేంద్ర ఫడ్నవీస్‌ను అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడం లేదని, దానికోసం ఉత్తరం రాశానని తెలంగాణ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.

ఈ కాలంలో అపాయింట్‌మెంట్ కావాలంటే నేరుగా ఫోన్ చేస్తారు కానీ, ఉత్తరాలు రాయరు అని కూడా తెలియనంత అమాయకులా తెలంగాణ ప్రజలు?

ఇంకా ఎన్నాళ్లు తెలంగాణ ప్రజలను ఇట్లా మోసం చేస్తారు?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments